Hyper Aadi: సైటైర్స్ తోపాటు సైలంట్ గా సెట్ చేసుకున్నాడుగా..!

  • July 29, 2023 / 05:49 PM IST

జబర్దస్త్ కమెడియన్ గా పాపులారిటీ సంపాదించుకొని ఆ తర్వాత సినిమాల్లో పలు రోల్స్ చేస్తూ రాజకీయాలలోను అడుగుపెట్టిన హైపర్ ఆది ప్రజెంట్ ఎలాంటి టాప్ పొజిషన్ లో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. సినిమా ఇండస్ట్రీలో మినిమం హీరో కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కంటే ఎక్కువ ఉంది హైపర్ ఆదికి . ఓ పక్క జబర్దస్త్ మరోపక్క రాజకీయాల ఈవెంట్స్ మరోపక్క సినిమాలో ఇలా బిజీబిజీగా గడిపేస్తున్న హైపర్ ఆదికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది.

హైపర్ ఆది పెళ్లెప్పుడు చేసుకుంటాడో..? ఎవరిని చేసుకుంటారని..? ఎంతోమంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . అయితే ఆయన పెళ్లికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. యాంకర్ చెల్లితో ప్రేమాయణం నడుపుతున్నాడు అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది . యూట్యూబ్ ఛానల్స్ లో యాంకర్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేసిన ఓ యాంకర్ తో పరిచయం ఏర్పడిందని ..

ఆమె ద్వారానే జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారని ..ఈ క్రమంలోనే ఆమెతో మొదలైన పరిచయం స్నేహంగా మారి తర్వాత ప్రేమగా మారిందని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతుండగా దీనిపై హైపర్ ఆది స్పందించే వరకు ఎదురు చూడాల్సిందే. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న (Hyper Aadi) హైపర్ ఆది..

పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని అభిమానుల సైతం ఆరాతీస్తున్నారు. ఇక మధ్య మధ్యలో షోలలో ఫేక్ పెళ్లిళ్లు చేసుకుని ఆది తన పెళ్లి అనుకోని తెగ మురిసిపోయేవాడు. అయితే ఇప్పుడు నిజంగానే పెళ్లికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. యూట్యూబ్ లో పనిచేసే ఒక యాంకర్ తో ఆయన ఏడడుగులు నడవబోతున్నాడని సమాచారం. అంతేకాదు ఆమె సపోర్టుతోనే ఇంత క్రేజ్ వచ్చినట్లు దాంతో వారి మధ్య మంచి స్నేహం ఏర్పడి, అది కాస్త ప్రేమగా మారిందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus