Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » ‘హైపర్‌’ మరో సూపర్‌హిట్‌ మూవీ అవుతుంది : రామ్‌

‘హైపర్‌’ మరో సూపర్‌హిట్‌ మూవీ అవుతుంది : రామ్‌

  • September 24, 2016 / 10:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘హైపర్‌’ మరో సూపర్‌హిట్‌ మూవీ అవుతుంది : రామ్‌

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌, టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సంతోష్‌ శ్రీన్‌వాస్‌ కాంబినేషన్‌లో వెంకట్‌ బోయినపల్లి సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘హైపర్‌’ (ప్రతి ఇంట్లో ఒకడుంటాడు). జిబ్రాన్‌ సంగీతం అందించిన ఈ సినిమా థియేట్రికల్‌, పాటల విడుదల కార్యక్రమం సెప్టెంబర్‌ 23న హైదరాబాద్‌ జె.ఆర్‌.సి.కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగింది.కార్యకమ్రంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న సుకుమార్‌, హరీష్‌ శంకర్‌, నాని హైపర్‌ థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా….

14 రీల్స్ నాకొక హోం బ్యానర్,ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ మాట్లాడుతూ – ”సంతోష్‌ ‘కందిరీగ’ కథ నాకు చెప్పినప్పుడు తను పెద్ద డైరెక్టర్‌ అవుతాడనిపించింది. ‘హైపర్‌’ కథ చెప్పేటప్పుడు కూడా నాకు అలాగే అనిపించింది. మా కాంబినేషన్‌లో సూపర్‌హిట్‌ అవుతుంది. సంతోష్‌ నాకెంటే హైపర్‌. సినిమా స్టార్ట్‌ చేసిన మూడు నెలలకే పూర్తి చేసేశాడు. నిర్మాతలు చాలా ప్యాషనేట్‌. వారి ప్యాషన్‌ ప్రతి సినిమాకు పెరుగుతుంది. నాకొక మరో హోం బ్యానర్‌ దొరికినట్లు అనిపిస్తుంది. జిబ్రాన్‌ చాలా మంచి ఆల్బమ్‌ ఇచ్చాడు. సమీర్‌రెడ్డి ప్రతి సీన్‌ను ఎంతో అద్భుతంగా చూపించారు. చాలా కమిట్‌మెంట్‌ ఉన్న వ్యక్తి. అలాగే అబ్బూరిరవిగారు ఎంతో సహకారం అందించారు. సెప్టెంబర్‌ 30న హైపర్‌ విడుదలవుతుంది” అన్నారు.

రామ్, సంతోష్ శ్రీన్ వాస్ కు పెద్ద హిట్ అవుతుంది,సుకుమార్‌ మాట్లాడుతూ – ”ట్రైలర్‌ సూపర్బ్‌గా ఉంది. ట్రైలర్‌ చూస్తుంటే పాజిటివ్‌ వైబ్స్‌ వస్తుంది. రామ్‌తో జగడం మూవీ చేశాను. అప్పటి నుండి ఇప్పటి వరకు తను అలాగే ఉన్నాడు. ఈ సినిమా రామ్‌కు పెద్ద హిట్‌ అవుతుంది. అలాగే 14 రీల్స్‌ నిర్మాతలు చాలా కూల్‌గా ఉంటారు. సంతోష్‌ శ్రీన్ వాస్‌కు ఈ సినిమా పెద్ద హిట్‌ అవుతుంది” అన్నారు.

`దూకుడు` లాంటి హిట్ కావాలి,హరీష్‌ శంకర్‌ మాట్లాడుతూ – ”14రీల్స్‌ బ్యానర్‌లో హైపర్‌ బిగ్గెస్ట్‌ హిట్‌ కావాలి. అందరూ డబ్బులు సంపాదించాలనే కోరికతో ఇండస్ట్రీకి వస్తారు కానీ 14 రీల్స్‌ గోపీ, రామ్‌, అనీల్‌గారు డబ్బు సంపాదించి సినిమాపై ప్యాషన్‌తో ఈ ఇండస్ట్రీలోకి వచ్చారు. ఈ బ్యానర్‌లో దూకుడు సినిమా వచ్చి ఐదేళ్లు అవుతుంది. అలాంటి హిట్‌ ఈ సినిమాతో నిర్మాతలు అందుకోవాలి. రామ్‌ కెరీర్‌లోనే ఈ ట్రైలర్‌ చాలా బిగ్గెస్ట్‌ హిట్‌ అవుతుంది. కందిరీగ వాసు ఎనర్జీ, స్పీడ్‌ అంటే ఇష్టం. పాటలు బావున్నాయి. సంతోష్‌కు ఈ సినిమా కమ్‌బ్యాక్‌ మూవీ అవుతుంది. ఈ కథను నాకు ముందుగా వినిపించాడు. కథ వినగానే నాకు నచ్చింది. సినిమా డెఫనెట్‌గా వాసు కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ అవుతుంది” అన్నారు.

రామ్ కు సరిపోయే టైటిల్,హీరో నాని మాట్లాడుతూ – ”14 రీల్స్‌ బ్యానర్‌లో నేను కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమా చేశాను. ఈ సినిమా సమయంలో వారితో మంచి అనుబంధం ఏర్పడింది. యూనిట్‌లో అందరినీ కూల్‌గా ఉండేలా చూస్తారు. ఇక హైపర్‌ సినిమా విషయానికి వస్తే అన్నీ పాటలు బావున్నాయి. జిబ్రాన్‌గారు సంగీతం అంటే చాలా ఇష్టం. ఈ సినిమాలో బేబిడాల్‌ సాంగ్‌ నాకు బాగా నచ్చింది. థియేట్రికల్‌ ట్రైలర్‌ చాలా బావుంది. రామ్‌కు సరిపోయే టైటిల్‌గా హైపర్‌ అని పెట్టారు. వాసుతో ఎప్పటి నుండో పరిచయం ఉంది. వాసు ఎంత ఎంటర్‌టైనింగ్‌గా ఉంటాడో హైపర్‌ సినిమా ఎంత ఎంటర్‌టైనింగ్‌గా ఉండబోతుందో నాకు తెలుసు. సినిమా పెద్ద సక్సెస్‌ కావాలని కోరుకుంటూ యూనిట్‌కు అభినందనలు” అన్నారు.

రామ్ ఎనర్జీకి సరిపోయే స్టోరీ `హైపర్`,దర్శకుడు సంతోష్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ – ”14 రీల్స్‌ అంటే ఇష్టమే కాదు, గౌరవం కూడా. రామ్‌తో ఎలాంటి కథతో సినిమా చేయాలో చర్చించి నిర్ణయం తీసుకోవడానికి మాకు మూడు నెలలు పట్టింది. కమర్షియల్‌ సినిమాల స్టయిల్‌లో కాకుండా ఏదో చెప్పాలి, దాంట్లో ఓ నిజాయితీ ఉండాలని రాసుకున్న కథే హైపర్‌. ప్రతి ఒకరికి వారి తండ్రే హీరో. ఈ సినిమాలో హీరోకు కూడా తండ్రే హీరో. తండ్రిని గెలిపించే కథే హైపర్‌. కథ రాసుకోగానే రామ్‌కు పర్‌ఫెక్ట్‌గా సరిపోయే కథ అని ఆయనకు చెప్పడం, ఆయనకు నచ్చడంతో అసలు యుద్ధం అక్కడ నుండే ప్రారంభమైంది. సినిమా చాలా బాగా వచ్చింది. సినిమా సక్సెస్‌ తర్వాత నేను సినిమా గురించి మాట్లాడుతాను. గౌతంరాజు, సమీర్‌రెడ్డి, అబ్బూరి రవి, జిబ్రాన్‌ సహా అందరూ ఎంతగానో సపోర్ట్‌ చేశారు. సత్యరాజ్‌గారు, మురళీశర్మ, రావు రమేష్‌ సహా అందరూ సపోర్ట్‌ చేశారు.నా కెరీర్‌లో, నేను చేసిన మూడు సినిమాల్లో ఇదే బెస్ట్‌ మూవీ అవుతుంది” అన్నారు.

జిబ్రాన్‌ మాట్లాడుతూ – ”ఈ ఆల్బమ్‌ నాకెంతో స్పెషల్‌. దర్శక నిర్మాతలు ఎంతగానో సపోర్ట్‌ చేశారు. పాటలకు చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. సపోర్ట్‌ చేసిన అందరికీ థాంక్స్‌” అన్నారు.

ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాతలు స్రవంతి రవికిషోర్‌, కె.ఎల్‌.దామోదర్‌ ప్రసాద్‌, దర్శకులు రాఘవపూడి, కిషోర్‌ తిరుమల, మురళీ శర్మ, ప్రభాస్‌ శ్రీను తదితరులు పాల్గొని యూనిట్‌ను అభినందించారు.ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ సరసన రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్‌, రావు రమేష్‌, మురళీశర్మ, పోసాని కృష్ణమురళి, ప్రభాస్‌ శ్రీను, తులసి, హేమ, ప్రియ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్‌, సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి, ఆర్ట్‌: అవినాష్‌ కొల్లా, ఎడిటింగ్‌: గౌతంరాజు, మాటలు: అబ్బూరి రవి, లైన్‌ ప్రొడ్యూసర్‌: హరీష్‌ కట్టా, సమర్పణ: వెంకట్‌ బోయినపల్లి, నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంతోష్‌ శ్రీన్‌వాస్‌.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #14 reela
  • #Hyper Movie
  • #Ram
  • #Rashi khanna
  • #Santosh Srinivas

Also Read

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Geetanjali: 37 ఏళ్ళ ‘గీతాంజలి’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Geetanjali: 37 ఏళ్ళ ‘గీతాంజలి’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

related news

Naga Vamsi: 300కి పైగా మల్టీప్లెక్సులు కలిగిన వ్యక్తి కూడా సింగిల్ స్క్రీన్స్ కష్టాలు వివరిస్తుంటే నవ్వొస్తుంది : నాగవంశీ

Naga Vamsi: 300కి పైగా మల్టీప్లెక్సులు కలిగిన వ్యక్తి కూడా సింగిల్ స్క్రీన్స్ కష్టాలు వివరిస్తుంటే నవ్వొస్తుంది : నాగవంశీ

Tollywood: అందుకు ఒప్పుకుంటేనే సినిమాలు వేస్తాం.. తేల్చి చెప్పేసిన ఎగ్జిబిటర్లు

Tollywood: అందుకు ఒప్పుకుంటేనే సినిమాలు వేస్తాం.. తేల్చి చెప్పేసిన ఎగ్జిబిటర్లు

PeddI: ఆ సినిమా గుర్తుకు రాకూడదు.. ‘పెద్ది’ సెట్స్‌లో అందరూ ఇదే మాట మీద..

PeddI: ఆ సినిమా గుర్తుకు రాకూడదు.. ‘పెద్ది’ సెట్స్‌లో అందరూ ఇదే మాట మీద..

Dileep Raj: ప్రముఖ ఆల్‌రౌండర్‌ కన్నుమూత.. 47 ఏళ్ల వయసులోనే..

Dileep Raj: ప్రముఖ ఆల్‌రౌండర్‌ కన్నుమూత.. 47 ఏళ్ల వయసులోనే..

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

trending news

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

1 day ago
Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

1 day ago
Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

1 day ago
The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

1 day ago
Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

1 day ago

latest news

Bunny Vasu : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ సమస్యలపై బన్నీవాస్ ట్వీట్ వైరల్.. సమస్యపై ఫోకస్ పెడితే బాగుంటుంది !

Bunny Vasu : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ సమస్యలపై బన్నీవాస్ ట్వీట్ వైరల్.. సమస్యపై ఫోకస్ పెడితే బాగుంటుంది !

1 day ago
Rahul Ramakrishna: ఇగోలతో సినిమాలు తీస్తే జనాలు ఎలా ఆధరిస్తారు : రాహుల్ రామకృష్ణ

Rahul Ramakrishna: ఇగోలతో సినిమాలు తీస్తే జనాలు ఎలా ఆధరిస్తారు : రాహుల్ రామకృష్ణ

1 day ago
Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

2 days ago
Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

3 days ago
Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version