ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కల నెరవేరింది. సినీ పరిశ్రమలోకి వచ్చినప్పటి నుంచి సూపర్ స్టార్ మహేష్ తో కలిసి నటించాలనే ఆశ తో ఉన్న ఈ భామకు ఈ రోజు ఆ కోరిక తీరింది. గురువారం నుంచి ఆమె మహేష్ తో జాయిన్ అయింది. తమిళ దర్శకుడు మురుగ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రిన్స్ మూవీ గతనెల 29 నుంచి షూటింగ్ జరుపుకుంటోంది.
పది రోజులుగా మహేష్ పై సన్నివేశాలను చిత్రీకరించారు. నేటి నుంచి మహేష్, రకుల్ మధ్య సన్నివేశాలను షూట్ చేశారు. దీంతో ఈ ముద్దుగుమ్మ ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. బ్రహ్మోత్సవం చిత్రంలో నటించే అవకాశం వచ్చినప్పుడు డేట్స్ ఖాళీ లేకపోవడంతో వదులుకుంది. మళ్లీ మహేష్ పక్కన ఛాన్స్ అనగానే కథ కూడా వినకుండా ఒకే చెప్పింది.
కేవలం మహేష్ కోసమే ఈ సినిమా ఒప్పుకున్నట్లు ఆమె వెల్లడించింది. అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ల జాబితాలో చేరిన ఈ నటి ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ధ్రువ సినిమాలో నటిస్తోంది. మరో రెండు ప్రాజెక్టులు ఆమె చేతిలో ఉన్నాయి.