వ్యాపారంలోకి వెళ్లే ఆలోచన లేదన్న కాజల్

  • December 30, 2017 / 10:26 AM IST

లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ .. అనేక మంచి పాత్రలు పోషించి తెలుగు సినీ యువరాణిగా పేరుతెచ్చుకుంది. ఈ సంవత్సరం కూడా ఖైదీ నంబర్ 150 , నేనే రాజు నేనే మంత్రి విజయాలను సొంతంచేసుకుంది. తమిళంలో ఆమె నటించిన మెర్సెల్ కూడా సూపర్ హిట్ అయింది. పదమూడేళ్లుగా సినీ పరిశ్రమలో ఉంటూ నేటి నటీమణులకు ఆదర్శంగా నిలుస్తోంది. ప్రస్తుతం తమిళంలో అజయ్ సరసన, తెలుగులో కళ్యాణ్ రామ్ కి జోడీగా నటిస్తోంది. అయితే ఈ మధ్య కాజల్ పై కొన్ని రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఛాన్స్ లు తగ్గిపోవడంతో కాజల్ సినిమాలు వదిలేసి వ్యాపారంలోకి అడుగు పెట్టనుందని జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై కాజల్ నేడు స్పందించారు. “నేను త్వరలో సినిమాలు వదిలేసి వ్యాపార రంగంలోకి ప్రవేశిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు. సినిమాలు వదిలేసే ఉద్దేశం అసలు లేదు” అని స్పష్టం చేసింది. చేతినిండా సినిమాలు ఉండడంతో పెళ్లిని సైతం వాయిదా వేసుకొని నటనపై తన అభిమానాన్ని చాటుకుంది. కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా.. చిన్న సినిమాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నాని నిర్మాతగా మారి నిర్మిస్తున్న “అ!” సినిమాలో గెస్ట్ రోల్ చేస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus