పెళ్ళి గురించి ఆలోచించట్లేదు : నయనతార
- August 11, 2016 / 12:20 PM ISTByFilmy Focus
ప్రభుదేవాను ప్రేమించిన నయనతార తనతో పెళ్ళికి సిద్ధపడింది. కొన్ని కారణాల వలన ఆ పెళ్ళి మధ్యలోనే ఆగిపోయింది. దీంతో నయనతార చాలా అప్సెట్ అయింది. కానీ ఏనాడు తన ప్రేమ వ్యవహారాల గురించి మీడియా ముఖంగా మాట్లాడలేదు ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రం తన ప్రేమ గురించి ప్రస్తావించింది. ప్రేమించిన వ్యక్తి కోసం సినిమాలకు దూరమవ్వాలనుకున్నాను.
ఎందుకంటే తనను నేను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పడానికే ఆ నిర్ణయం తీసుకున్నాను. తనకు దూరమయిన తరువాత ఆ బాధ నుండి బయట పడడానికి నాకు సినిమాలనే చక్కటి ప్రత్యామ్నాయంగా అనిపించింది. నా జీవితంలో నేను అనుకున్నట్లుగా ఏది జరగట్లేదు. అందుకే పెళ్ళి గురించి ఆలోచించట్లేదు. అయినా.. అంత సమయం కూడా నాకు లేదిప్పుడు. ప్రస్తుతం సినిమాలతో చాలా బిజీగా ఉన్నానని స్పష్టం చేసింది.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus













