ఎక్కువ పెళ్లిళ్లు చేసుకుంటేనే కదా ఛాన్స్!

  • July 25, 2016 / 06:27 AM IST

బాలీవుడ్ టాప్ హీరోయిన్ కంగనా రనౌత్ రీసెంట్ గా జరిగిన 2016 ఇండియా కౌంటర్ వీక్ ఫ్యాషన్ షోలో కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. ప్రముఖ డిజైనర్ మానవ్ రూపొందించిన వెడ్డింగ్ డ్రెస్ ను కంగనా ధరించి స్టేజ్ మీద క్యాట్ వాక్ చేసింది.

ఇందులో భాగంగా మానవ్ డిజైన్ చేసిన డ్రెస్ చాలా బాగుందని పొగిడింది. నా మొదటి పెళ్ళికి ఈ దుస్తులనే ధరిస్తాను. ఎక్కువ పెళ్లిళ్లు చేసుకుంటేనే కదా ఇలాంటి డ్రెస్ లు వేసుకోవడానికి ఎక్కువ ఛాన్సులు వస్తాయని సరదాగా వ్యాఖ్యానించింది. తన పెర్శనల్ విషయాల గురించి ప్రశ్నిస్తే సమాధానాలు చెప్పానని మీడియాకు ముందుగానే చెప్పిన ఈ క్వీన్ తన పెళ్లి ఎప్పుడనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus