‘శక్తి’ చిత్రాన్ని నేను మర్చిపోలేను: తారక్

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడు మెహర్ రమేష్ గురించి ఎవరూ మర్చిపోలేరు. అయన్ని మర్చిపోలేకపోవడానికి… అయన అన్ని భారీ హిట్లు ఇచ్చాడా..? అని మీ డౌట్..? కానీ ఆయన్ని ఎందుకు మర్చిపోలేమంటే… ఒక హీరోకి స్టోరీ చెప్పి ఒప్పించే కెపాసిటీ ఆయనకి ఉందట. అయన స్టోరీ చెబితే ఎంత పెద్ద స్టార్ హీరో అయినా… ఓకే అనేస్తాడంట. అంతలా కన్వెన్స్ చేసే టాలెంట్ ఆయనకి ఉందని అప్పట్లో వార్తలు వచ్చాయి. కేవలం హీరోలు మాత్రమే కాదు.. నిర్మాతలు, ప్రేక్షకులు కూడా మెహర్ రమేష్ మాటలకి కన్వెన్స్ అయిపోతారు అనడంలో సందేహం లేదు.

అలా మెహర్ రమేష్ ని టాలీవుడ్ కి డైరెక్టర్ గా పరిచయం చేసిన ఘనత జూ.ఎన్టీఆర్ కె దక్కింది. ‘కంత్రి’ చిత్రంతో మెహర్ కి డైరెక్టర్ ఛాన్స్ ఇచ్చాడు తారక్. ఆ చిత్రం సమ్మర్ రేస్లో రావడం వలన బాగానే కలెక్ట్ చేసి గట్టెక్కేసింది. దీంతో కమర్షియల్ హిట్ ఇచ్చాడని మెహర్ కి అనుకోకుండా మంచి పేరు వచ్చేసింది. ఇక వెంటనే ప్రభాస్ ‘బిల్లా’ చిత్రం చేసే ఛాన్స్ దక్కింది. ఈ చిత్రం కూడా ప్రభాస్ కి ఉన్న స్టైలిష్ ఇమేజ్ వలన పర్వాలేదనిపించింది. ఇక ఇక్కడ నుండీ మొదలైంది మెహర్ కళా కండాలు మొదలయ్యాయి అవే ‘శక్తి’ ‘షాడో’. మొదటి సినిమా హిట్ ఇచ్చాడని గుడ్డిగా నమ్మేసి ఎన్టీఆర్ మళ్ళీ ‘శక్తి’ చిత్రానికి ఛాన్స్ ఇచ్చాడు.

అంతే ‘మగధీర’ ‘పోకిరి’ అనే చిత్రాల్ని కలిపేసి.. అటు పెరియాడికల్ మూవీనో లేక మాఫియా మూవీనో అర్ధంకాక ప్రేక్షకులకి తలనొప్పి తెప్పించింది. ఈ చిత్రాన్ని దాదాపు 50 కోట్ల బడ్జెట్ పెట్టి అశ్వినీదత్ నిర్మించగా 20 కోట్లు కూడా వసూళ్ళు రాబట్టలేక తీవ్ర నష్టాల్ని మిగిల్చింది. ఈ చిత్రం ఎన్టీఆర్ కి ఓ పెద్ద మచ్చలా ఉంది పోయిందని తాజాగా ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ చెప్పిన ఆన్సర్ ని బట్టి అర్ధం చేసుకోవచ్చు. ‘యమదొంగ’ తర్వాత మీరు ఫాంటసీ, హిస్టారికల్ మూవీ చేయలేదు కదా అనే ప్రశ్నకి ఎన్టీఆర్ బదులిస్తూ “భలేవారే… ‘శక్తి’ మర్చిపోయారేంటి..? మీరు మర్చిపోయినా నేను మర్చిపోలేను” అంటూ సమాధానమిచ్చి అందరినీ నవ్వించాడు. మొత్తానికి ‘శక్తి’ చిత్రం తారక్ ను అంత బయపెట్టేసిందన్న మాట..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus