ఇష్టమైనప్పటికీ ఆ సినిమాలు చేయనని చెప్పిన కాజల్
- July 19, 2017 / 01:54 PM ISTByFilmy Focus
తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా పరిచయం చేసిన తేజ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ “నేనే రాజు నేనే మంత్రి” సినిమా చేసింది. ఈ సినిమా షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం కంప్లీట్ చేసుకొని వచ్చేనెల 11 న రిలీజ్ కి సిద్ధమైంది. ప్రస్తుతం తెలుగులో తన మొదటి హీరో కళ్యాణ్ రామ్ సరసన ఓ సినిమా చేస్తోంది. అలాగే తమిళంలో అజయ్ కి జోడీగా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ నిమిత్తం లండన్ కి వెళ్లిన కాజల్ అక్కడి వెబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో వారు స్పోర్ట్స్ బేస్డ్ సినిమాలు చేస్తారా? అనే ప్రశ్నకు చేయనని సమాధానం ఇచ్చింది.
“చిన్నప్పుడు టెన్నిస్ బాగా ప్రాక్టీస్ చేసేదాన్ని. ప్రస్తుతం ప్రాక్టీస్ చేయడం లేదు. టెన్నిస్ తారల్లో సానియా అంటే ప్రత్యేకమైన అభిమానం. ఇప్పటికీ స్పోర్ట్స్ బేస్డ్ సినిమాలు చూస్తాను, కానీ నటించలేను” అని కాజల్ స్పష్టం చేసింది. ఎక్కువగా రొమాంటిక్ కామెడీ మూవీస్ అంటే ఇష్టమని, అటువంటి సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తానని మనసులో మాట బయటపెట్టింది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.













