చిత్రం, నువ్వు నేను, జయం.. వంటి సినిమాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో ట్రెండ్ సృష్టించిన డైరక్టర్ తేజ. వరుస హిట్లు అందుకున్న ఈయనకు కొన్నేళ్లుగా విజయాలు వరించడం లేదు. తాజాగా దగ్గుబాటి రానా, కాజల్ అగర్వాల్ ని హీరోయిన్లుగా పొలిటికల్ థ్రిల్లర్ ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా గురించి కంటే కొన్నిరోజులక్రితం తేజ ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పిన మాటల గురించి ప్రస్తుతం ఫిలింనగర్లో ఎక్కువమంది మాట్లాడుకుంటున్నారు. అందులో మెగాస్టార్ చిరంజీవి పిలిచి అవకాశం ఇచ్చినా తాను అతన్ని డైరక్ట్ చేయలేనని తేజ సంచలన వ్యాఖ్యలు చేశారు.
చిరు అంటే ఇష్టమే కానీ అటువంటి స్టార్ తో సినిమా అంటే తన వల్ల కాదని చెప్పారు. అంతేకాదు ఇప్పుడున్న హీరోల్లో కమలహాసన్, రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, బాలకృష్ణ వంటి హీరోలను డైరక్ట్ చేయగలను కానీ జూనియర్ ఎన్టీఆర్ ని డైరక్ట్ చేయలేనని వివాదాస్పదంగా మాట్లాడారు. ఎందుకు చిరు, తారక్ తో సినిమా చేయలేరని హోస్ట్ ప్రశ్నించగా ఆశ్చర్యకరమైన సమాధానం చెప్పారు. వారు ఒక రకమైన సర్కిల్లో ఉంటారని, ఆ ప్రకారమే సినిమాని తెరకెక్కించాల్సి ఉంటుందని అలా తాను చేయలేనని స్పష్టం చేశారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.