ఇంతకంటే పెరగడం నావల్ల కాదండీ

అసలే స్టార్ హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉంది, అలాగే వరుసబెట్టి స్టార్ హీరోలందరి సరసన నటించే అవకాశాలు అందిపుచ్చుకుంటుంది. ఈ టైమ్ లో రాంగ్ స్టెప్ అవసరమా అనుకుందో లేక ఈ టైమ్ లో ఇలాంటి సమయంలో ఎందుకు అనుకొందో తెలియదు కానీ.. “మహానటి” చిత్రం కోసం ఇంకాస్త బరువు పెరగమని దర్శకుడు నాగఅశ్విన్ కోరాడట. అతడి కోరికను మొదట్లో చాలా సున్నితంగా తిరస్కరించిన కీర్తి సురేష్ పదే పదే ఆ విషయమై ఫోర్స్ చేయడంతో.. “ఇప్పటికే క్యారెక్టర్ కోసమని చాలా లావయ్యాను, ఇంతకుమించి లావైతే నా కెరీర్ కే సమస్యగా మారి.. నా భవిష్యత్ ను పాడుచేసే అవకాశాలున్నాయి. అందుకే ఇంకోసారి నన్ను బరువు పెరగమని మాత్రం అడగకండి” అని ఖరాకండిగా చెప్పేసిందట. ఏకంగా టైటిల్ పాత్రధారిణి అంత ఘాటుగా సమాధానమిచ్చేసరికి ఏం చేయాలో తోచని దర్శకుడు నాగఅశ్విన్ మిన్నకుండిపోయాడట.

తెలిసి చేసిందో తెలియక చేసిందో తెలియదు కానీ.. కీర్తిసురేష్ మాత్రం సరైన నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే అనుష్క కూడా కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగా “సైజ్ జీరో” సినిమా కోసం బరువెక్కింది. ఇక అప్పట్నుంచి సన్నబడదామని ఎన్ని కసరత్తులు చేస్తున్నా కూడా సరైన రిజల్ట్ లభించక చాలా ఇబ్బంది పడింది. అనుష్క “సాహో” సినిమాలో నటించలేకపోవడానికి కారణం కూడా అధిక బరువే. సో, అనుష్కను చూసే నేర్చుకుందో లేక ఎందుకొచ్చిన కష్టం అనుకొందో కానీ.. బరువు పెరగడానికి మాత్రం ముమ్మాటికీ ఒప్పుకోలేదు కీర్తి సురేష్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus