టాలీవుడ్ క్రేజీ బ్యూటీ సమంతకు ప్రస్తుతం శుభఘడియలు నడుస్తున్నాయి. త్వరలో కల్యాణ ఘడియలు రాబోతున్నాయి. ఈ ఆనందంలో సోషల్ మీడియా వేదికగా స్యామ్ అభిమానులతో బుధవారం కాసేపు ముచ్చటించారు. ఫ్యాన్స్ అడిగిన అనేక విషయాలపై మనసువిప్పి మాట్లాడారు. మీకు కెరీర్ లో మంచి సలహా ఎవరు ఇచ్చారు? అదేమిటి? అని ఓ అభిమాని అడిగిన ట్వీట్ కి సమంత స్పందిస్తూ.. ” చేసే ప్రతి సినిమాను తొలి సినిమాగా భావించని సూపర్ స్టార్ మహేష్ బాబు ఇచ్చిన సలహా నేను మరిచి పోలేను” అని చెప్పారు.
మళ్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి నటిస్తున్నారా ? అని ఈ భామను అడగగా.. ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. ఇప్పుడు తెలుగులో ఏ సినిమాకు సైన్ చేయలేదని వెల్లడించారు. అవి లేకుంటే మీరు ఉండలేరు అనేటువంటి మూడింటి గురించి చెప్పమని ఓ ఫ్యాన్ క్రేజీ ప్రశ్న అడగగా.. అందుకు ఈ బ్యూటీ అంతే క్రేజీగా సమాధానం చెప్పింది. “చైతు, ఐస్ క్రీమ్, పని.. ఇవి లేకుంటే నేనుండలేను” అని రీట్వీట్ చేసి ప్రియుడు నాగ చైతన్య పై తనలోని ప్రేమను బయటపెట్టింది.
Treat every film like it’s your first -Mahesh babu https://t.co/ZtX8LX6l72
— Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) October 26, 2016
Chay, masqati ice cream and work https://t.co/VyKIC8mqev
— Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) October 26, 2016
No it’s not true 😊https://t.co/D9VxKJq4EG
— Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) October 26, 2016