Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » `శివ‌లింగ‌`లో ఛాలెంజింగ్ పాత్ర‌లో న‌టించాను – రితిక సింగ్‌!

`శివ‌లింగ‌`లో ఛాలెంజింగ్ పాత్ర‌లో న‌టించాను – రితిక సింగ్‌!

  • April 11, 2017 / 06:31 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

`శివ‌లింగ‌`లో ఛాలెంజింగ్ పాత్ర‌లో న‌టించాను – రితిక సింగ్‌!

డాక్ట‌ర్ కాబోయి యాక్ట‌ర్ అయిన‌వాళ్లు.. ఇంజినీర్ కాబోయి యాక్ట‌ర్ అయిన‌వాళ్లు ఉన్నారు. అదే త‌ర‌హాలో మార్ష‌ల్ ఆర్ట్స్ నేప‌థ్యం నుంచి అనూహ్యంగా న‌టిగా అవ‌కాశం అందుకుంది రితిక సింగ్‌. ఆరంభ‌మే విక్ట‌రీ వెంక‌టేష్ సినిమా `గురు`లో కిక్‌బాక్స‌ర్ పాత్ర‌లో మెప్పించింది. ప్ర‌స్తుతం పి.వాసు ద‌ర్శ‌క‌త్వంలో రాఘ‌వ‌లారెన్స్ స‌ర‌స‌న‌ `శివ‌లింగ‌` చిత్రంలో న‌టించింది. రెండు విభిన్న‌మైన సినిమాల్లో వైవిధ్యం ఉన్న పాత్ర‌ల్లో నటించాన‌ని రితిక చెబుతోంది. ఏప్రిల్ 14న `శివ‌లింగ‌` రిలీజ్ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో పాత్రికేయుల‌తో ముచ్చ‌టిస్తూ రితిక చెప్పిన సంగ‌తులివి…

*స్వ‌త‌హాగా నేను బాక్సార్‌ని. చిన్న‌పుడే బాక్సింగ్ నేర్చుకున్నా. ఏసియ‌న్ బాక్సింగ్ ట్రోఫీలో విన్న‌ర్‌గా నిలిచాను. ఆ క్ర‌మంలోనే న‌న్ను చూసిన‌ మ్యాడీ (మాధ‌వ‌న్‌) నాన్న‌గారిని సంప్ర‌దించి త‌మిళ‌చిత్రం `ఇరుదుసుత్రు`లో అవ‌కాశం ఇచ్చారు. వాస్త‌వానికి నేనుఎప్పుడూ న‌టి అవ్వాల‌నుకోలేదు. రియ‌ల్ లైఫ్‌లో మార్ష‌ల్ ఆర్ట్స్ ఫైట‌ర్‌ని. అయితే ఇలా సినిమాల్లోకి వ‌స్తాన‌ని అనుకోలేదు. ప్ర‌తిదీ అనుకోకుండా జ‌రిగిన‌దే. అనుకోకుండానే మ్యాడీ స‌ర్నా.. నాన్న‌గారిని క‌లిసి బాక్స‌ర్ రోల్ చేయాల్సిందిగా అడిగారు. ఆడిష‌న్స్ కి వెళ్లి సెల‌క్ట‌యిపోయాను. ఆ సినిమా త‌మిళ్ హిందీలో స‌క్సెస్ సాధించింది. ఆ త‌ర్వాత తెలుగులో వెంకటేష్ `గురు`లోనూ ఛాన్స్ వ‌చ్చింది.

*`శివ‌లింగ` చిత్రం క‌థ న‌చ్చి న‌టించాను. ముఖ్యంగా నా పాత్ర న‌న్ను ఆక‌ట్టుకుంది. అందుకే ఇందులో న‌టించేందుకు ఒప్పుకున్నా. ఇదో హార‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్‌. క‌న్న‌డ వెర్ష‌న్ `శివ‌లింగ‌` చూశాను. ఆ సినిమా ప్ర‌భావం నాపై ప‌డ‌కుండా ఎంతో జాగ్ర‌త్త తీసుకుని ఫ్రెష్‌గా న‌టించాను. గురు చిత్రంలో మేక‌ప్ లేకుండా న‌టించాను. ఇందులో ఓ మామూలు అమ్మాయిగా న‌టించాలి. మేక‌ప్ వేసుకున్నా. డ్యాన్సులు చేయ‌డం, డిఫ‌రెంట్ ఎక్స్‌ప్రెష‌న్స్ ఇవ్వ‌డం చాలా క‌ష్టంగా అనిపించింది. ఇదివ‌ర‌కూ నేనెప్పుడూ డ్యాన్సులు చేయ‌లేదు. లారెన్స్ మాష్టార్ మంచి డ్యాన్స‌ర్‌. డ్యాన్సులు అద‌ర‌గొట్టేస్తారాయ‌న‌. నాకేమో డ్యాన్సులు చాలా క‌ష్టం. దీనికితోడు శారీలో క‌నిపించాలి. శారీలోనే డ్యాన్సులు చేయాలి. అది ఇంకా పెద్ద స‌వాల్ అనిపించింది. మొత్తానికి ఈ చిత్రం చాలా పెద్ద ఛాలెంజింగ్ అనిపించింది. డ్యాన్సులు చేసేప్పుడు బాడీ లాంగ్వేజ్‌, ఎక్స్‌ప్రెష‌న్స్ పై లారెన్స్ మాష్టార్ స‌ల‌హాలు ఇచ్చారు. ఈ చిత్రంలో యాక్ష‌న్ ఎపిసోడ్స్ హైలైట్‌గా ఉంటాయి.

*బాక్సింగ్‌తో పోలిస్తే యాక్టింగ్ చాలా క‌ష్టం. చిన్న‌ప్ప‌టినుంచి మార్ష‌ల్ ఆర్ట్స్ , బాక్సింగ్ నేర్చుకున్నా. అవి చేయ‌డం ఈజీ. కానీ న‌ట‌న క‌ష్టం. కొత్త అవ్వ‌డం వ‌ల్ల‌నే ప్ర‌తిదీ క‌ష్టం అనిపించింది. శివ‌లింగ సినిమా చేసేప్పుడు యాక్ష‌న్ ఎపిసోడ్స్‌, డ్యాన్సుల కోసం ఎక్కువ శ్ర‌మించాల్సొచ్చింది. ఉద‌యం 9 గంట‌ల నుంచి సాయంత్రం 7 వ‌ర‌కూ ప్రాక్టీస్ చేసేదాన్ని.* గురు చిత్రంలో వెంక‌టేష్‌, సాలా ఖుడూస్‌లో మాధ‌వ‌న్ తో క‌లిసి న‌టించాను. ఆ ఇద్ద‌రూ అమేజింగ్ యాక్ట‌ర్స్‌. అన్నిర‌కాలుగా స‌పోర్ట్ చేశారు. ఎన్నో విలువైన విష‌యాలు వారి నుంచి నేర్చుకున్నా. గురు చిత్రంతో తెలుగులో ప్ర‌వేశించ‌డం ఆనందంగా ఉంది. వెంక‌టేష్ గారు ఈ చిత్రంలో న‌టించేందుకు నాకు ఎంతో సాయం చేశారు.

*ప్ర‌స్తుతం తెలుగులో క‌థ‌లు వింటున్నా. మంచి అవ‌కాశాలు వ‌స్తే న‌టించేందుకు సిద్ధ‌మే. కెరీర్‌లో వైవిధ్యం ఉన్న సినిమాలు చేయాల‌నుకుంటున్నా. న‌ట‌న‌కు ఆస్కారం ఉండేవి ఎంపిక చేసుకుంటా. త‌మిళంలో ఓ చిత్రంలో న‌టిస్తున్నా. * ప్రియాంక చోప్రా, ఆలియాభ‌ట్‌, అనుష్క శ‌ర్మ నా అభిమాన తార‌లు. వీళ్లంతా నాకు ఇన్‌స్పిరేష‌న్‌. వీళ్లంతా చిన్న‌వ‌య‌సులో ఎంతో ఇన్‌స్ప‌యిరింగ్‌గా ఎదిగిన తీరు న‌న్ను ఆలోచింప‌జేస్తుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guru Movie
  • #p vasu
  • #Raghava Lawrence
  • #Ritika Singh
  • #Ritika Singh Movies

Also Read

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

related news

TVK: విజయ్‌ వదిలేసిన స్థానంలో సినిమా వారికేనా? ఆ ఇద్దరూ కాకపోతే..

TVK: విజయ్‌ వదిలేసిన స్థానంలో సినిమా వారికేనా? ఆ ఇద్దరూ కాకపోతే..

Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. ఇదేం లాజిక్‌.. అక్కడేం జరుగుతోంది?

Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. ఇదేం లాజిక్‌.. అక్కడేం జరుగుతోంది?

trending news

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

2 hours ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

3 hours ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

21 hours ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

1 day ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago

latest news

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

4 mins ago
H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

15 mins ago
Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

3 hours ago
Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

4 hours ago
H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version