నా పర్సనల్ ఇష్యూస్ పబ్లిక్ గా డిస్కస్ చేయను

తెలుగులో వైవిఎస్ చౌదరి దేవదాసుతో పరిచయమై తక్కువ టైంలోనే స్టార్ హీరొయిన్ గా దూసుకుపోయిన ఇలియానా పరిశ్రమకు వచ్చి 12 ఏళ్ళు అవుతోంది. ఇంకా అడపాదడపా అవకాశాలు కొట్టేస్తున్న ఇలియానాను ఎవరు పలకరించినా ఏదైనా అడగండి తన పెళ్లి గురించి తప్ప అనేలా వ్యవహరిస్తోంది.గతంలో తన అబ్రాడ్ బాయ్ ఫ్రెండ్ ఆండ్రూతో ఎప్పటి నుంచో చాలా క్లోజ్ గా మూవ్ అవుతూ సోషల్ మీడియాలో పిక్స్ కూడా షేర్ చేసుకునేది ఇల్లి బేబీ. ఓసారి అండ్రూని భర్త అనే మీనింగ్ వచ్చేలా సంభోదిస్తూ చనువుగా ఉన్న ఫోటోలు కూడా పోస్ట్ చేసింది. అందరూ ఇలియానాకు పెళ్లైందని ఆ విషయాన్ని అక్కడితో వదిలేసారు. కాని అందరూ ఇప్పుడు మర్చిపోయి ఉంటారేమో అనుకున్నట్టుంది అజయ్ దేవ్ గణ్ నటించిన రైడ్ ట్రైలర్ లాంచ్ లో మాత్రం పెళ్లి ప్రశ్నకు చాలా తెలివైన సమాధానం ఇచ్చింది.

ప్రపంచం ఇంకా తనను చూడాల్సింది చాలా ఉందని కెరీర్ పర్సనల్ లైఫ్ పట్ల తాను హ్యాపీగా ఉన్నానని చెప్పిన ఇలియానా పెళ్లి గురించి మాట్లాడడానికి ఇది సందర్భం కాదని తేల్చేసింది.వ్యక్తిగత జీవితం గురించి పబ్లిక్ గా చెప్పుకునే ఉద్దేశం తనకు ప్రస్తుతానికి లేదని క్లారిటీ ఇచ్చేసింది. తన పెళ్లి విషయంలో ప్రపంచం చూడాల్సింది చాలా ఉందన్న ఇలియానా అదేంటి అనే దాని గురించి స్పష్టత మాత్రం ఇవ్వలేదు. కాకపొతే సోషల్ మీడియాలో భర్తగా తానే చూపించుకున్న అండ్రూ ప్రస్తావన అక్కడ ఎక్కువ రాకుండా జాగ్రత్త పడింది. లాస్ట్ ఇయర్ అజయ్ తో బాద్శాహో చేసి దెబ్బ తిన్న ఇలియానా ఈ సారి మాత్రం రైడ్ బ్లాక్ బస్టర్ అవుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేసింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus