సన్‌రైజర్స్ ఓనర్ కావ్యా మారన్ బాధను చూసి తాను తట్టుకోలేకపోతున్నానని అన్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. ఏం జరిగిందంటే.. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో సన్‌రైజర్స్ హైదారబాద్ గత కొన్ని సీజన్లుగా పేలవ ప్రదర్శన చేస్తూ అభిమానులను నిరుత్సాహపరుస్తోంది. ప్రతీ సీజన్‌కు ఆటగాళ్లతో పాటు కోచ్‌లను మారుస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. ఎంత ప్రయత్నించినా.. సన్‌రైజర్స్ ఆటతీరు మాత్రం పేలవంగానే ఉంటోంది. ఇక ఈ సీజన్..14 మ్యాచ్‌లు ఆడి కేవలం నాలుగే విజయాలనే అందుకుంది ఫలితంగా ఆఖరి స్థానంతో ముగించింది. అయితే దీనిపై సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు.
సన్‌రైజర్స్ ఓనర్ కావ్యా మారన్ బాధను తాను చూడలేకపోతున్నానని అన్నారు. సన్‌రైజర్స్ మ్యాచ్ ఓడిపోయినప్పుడు స్టేడియంలో కావ్య నిరాశగా ఉండటం నేను చూడలేకపోతున్నాను. చాలా సార్లు టీవీ ఛానల్‌ను కూడా మార్చేశాను. కాబట్టి కళానిధి మారన్(కావ్యా మారన్ తండ్రి)కు ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను. జట్టులో మంచి ప్లేయర్స్‌కు అవకాశం ఇవ్వాలి.వేలంలో మెరగైన ఆటగాళ్లను సొంతం చేసుకోవాలి. జట్టున మరింత బలపేతం చేయాలని అని సూచించారు.
రజనీకాంత్ ప్రస్తుతం రజనీకాంత్ (Rajinikanth) జైలర్ అనే సినిమా చేస్తున్నారు. నెల్సన్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాల నడుమ వస్తోంది ఈ సినిమా. తమన్నా హీరోయిన్గా చేస్తోంది. ఇక ఈ సినిమా ఆగస్టు 10న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో టీమ్ ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేసింది. అందులో భాగంగా వరుసగా పాటల్నీ విడుదల చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి కావాలా అనే పాటను విడుదల చేసింది టీమ్. ఈ పాటకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ దక్కుతోంది.