సోల్ మేట్ తో నిశ్చితార్ధం అంటూ ఆశ్చర్య పరిచిన యాంకర్ లాస్య

  • January 30, 2017 / 11:17 AM IST

తెలుగు యాంకర్ల పుస్తకంలో లాస్య కు కొన్ని పేజీలున్నాయి. కో యాంకర్ రవితో కలిసి ఆమె చేసే హంగామా  బుల్లితెర ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేసింది. ప్రస్తుతం ‘రాజా మీరు కేక’ అనే సినిమాతో వెండి తెరపై అడుగుపెట్టబోతోంది. ఆ చిత్రంలో లాస్య నటనను చూసి ఆనందించేలోపే షాకిచ్చింది. తాను పెళ్లిచేసుకోబోతున్నట్లు చెప్పి ఆశ్చర్యంలో ముంచెత్తింది. ‘జీవితంలో ప్రత్యేక రోజు కోసం సిద్ధమవుతున్నందుకు సంతోషంగా ఉంది. నా సోల్ మెట్ తో ఎంగేజ్ మెంట్ జరుగుతున్నందుకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. ప్రేమ విలువైంది. పెళ్లికి ముందు జరిగే నిశ్చితార్ధం ఎంతో ఆసక్తితో కూడుకుంది.’ అంటూ నేడు లాస్య సోషల్ మీడియాలో శుభవార్తను వెల్లడించింది.

డిజైనర్ ఈశ్వరీ తయారు చేసిన ఎంగేజ్ మెంట్ డ్రెస్ లో ఉన్న ఫోటోను లాస్య తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసింది. అయితే ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న ఆ సోల్ మెట్ పేరు మాత్రం వెల్లడించలేదు. లాస్య మనసుదోచుకున్న వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని అభిమానులు ప్రయత్నిస్తున్నారు. ఆ వ్యక్తి ఎవరో నేడు సాయంత్రం లోపున బయటికిరానుంది. గతంలో  రవి మోసం చేయడంతో లాస్య ఆత్మహత్యకు ప్రయత్నించిందని, హీరో రాజ్ తరుణ్ ని పెళ్లిచేసుకుందని రూమర్లు షికారు చేశాయి. వీరిద్దరిలో లాస్య ని పెళ్లిచేసుకోబోయే వ్యక్తి ఉన్నారా? అని నెటిజనులు సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus