‘బిగ్ బాస్3’ కంటెస్టెంట్ రాజకీయాల్లోకి వస్తుందట..?

‘బిగ్ బాస్3’ ఈ షో పై ఎప్పుడూ ఎదో ఒక వివాదం జరుగుతూనే ఉంది. హౌస్ లో ఉన్నంత వరకూ కంటెస్టెంట్ లు బాగానే ఉంటారు కానీ. హౌస్ నుండీ ఎలిమినేట్ అయ్యాక మాత్రం వాళ్ళు ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుంటారు. ఇక్కడే కాదు తమిళ ‘బిగ్ బాస్’ కూడా అదే పరిస్థితి. ఇప్పుడు ఓ హౌస్ మేట్ చేసిన ఆరోపణలు చూస్తే చాలా విడ్డూరంగా అనిపించక మానవు. ‘మిస్ ఇండియా’ కిరీటాన్ని గెలుచుకున్న మీరా మిథున్‌ అనే నటి కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్3’ లో ఓ కంటెస్టెంట్ గా పాల్గొంది.

ఈమె ఇప్పుడు బిగ్ బాస్ నిర్వాహకుల పై కూడా మండిపడుతూ చేసిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. మీరా మిథున్‌ మాట్లాడుతూ.. “నేను ‘బిగ్‌బాస్‌ సీజన్‌ 3’ లో పాల్గొని అందులోంచి బయటకు వచ్చి రెండు నెలలు కావొచ్చింది. అయినా నేను బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌ షోలో పాల్గొనందుకు గానూ, ఆ గేమ్‌ షో నిర్వాహకులు… ఇంకా ఒక్క పైసా కూడా చెల్లించలేదు. ఈ విషయమై విజయ్‌ టీవీ నిర్వాహ సంస్థకు వెళ్ళి అడిగాను… అయినా ఎవరూ సరిగ్గా బదులివ్వలేదు. అది మోసపూరిత చర్యగా అనిపించింది. అదేవిధంగా నా గురించి తప్పుడు ప్రచారం చాలానే జరుగుతోంది. మొత్తం మీద తమిళనాడులో నివశించడానికి నాకు రక్షణ లేని పరిస్థితి నెలకొంది. వేరే రాష్ట్రానికి వెళితేనే నేను సురక్షితంగా జీవించగలను. ఇక్కడ పోలీసులు లంచం తీసుకుని నాపై తప్పుడు కేసులు పెట్టారు. దీనిని సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియజేయాలి. అంతేకాదు త్వరలోనే రాజకీయాల్లోకి వస్తున్నాను. ” అంటూ చెప్పుకొచ్చింది.

మీకు మాత్రమే చెప్తా సినిమా రివ్యూ & రేటింగ్!
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus