“తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు తనను డైరెక్ట్ చేసే దర్శకులతో ఒక ఫ్రెండ్ గా ఉంటారు. అందుకే ఆయన సినిమాలు హిట్ సాధిస్తున్నాయి… ఆ డైరక్టర్లతో మళ్లీ మళ్లీ సినిమాలు చేస్తున్నారు..” ఈ మాటలు అన్నది ఎవరో కాదు బ్రహ్మోత్సవం బ్యూటీ సమంత. ఇదే విషయాన్నిసమంత ఒక ఇంటర్వ్యూ లో ప్రిన్స్ ని అడిగింది.
అందుకు మహేష్ మాట్లాడుతూ “త్రివిక్రమ్, శ్రీను వైట్ల, శ్రీకాంత్ అడ్డాల.. ఇలా నేను పని చేసిన డైరక్టర్లు మోస్ట్ ట్యాలెంట్ ఉన్నవారు. వారితో కలిసి పని చేయడం ఎంతో బాగుంటుంది. అందుకే వారు కథ చెప్పిన వెంటనే చేద్దాం అంటాను” అని చెప్పారు.
ఇదే ఇంటర్వ్యూ లో బ్రహ్మోత్సవం షూటింగ్ సమయంలో తాను గమనించిన ఒక విషయం గురించి మహేష్ ని అడిగింది. “డైరక్టర్ ఓకే చెప్పిన టేక్ ను కూడా మీరెందుకు రీ టేక్ చేద్దామని అడుగుతారు?” అని ప్రశ్నించింది. “డైరక్టర్ నాకు కథ చెప్పినప్పుడు ఏ ఫీల్ తో చెప్పాడో .. ఆ ఫీల్ వచ్చిందా ? లేదా? అని ఆలోచిస్తాను. అందుకే రెండో, మూడో టేక్ లో బెస్ట్ ఎమోషన్ ఇవ్వగలమా అని.. నాకు నేను పరీక్షించుకుంటాను” అని సూపర్ స్టార్ చెప్పారు. ఇలా ఆలోచిస్తారు కాబట్టే మహేష్ బాబు డైరక్టర్లకు బెస్ట్ ఫ్రెండ్ అయ్యారని ప్రత్యేకంగా చెప్పాలా?