అక్కినేని అందగాడు అఖిల్ పరిచయం చిత్రం “అఖిల్” కేవలం అక్కినేని వంశాభిమానులకే కాక నిర్మాత నితిన్ కు కూడా ఒక పీడకల లాంటిది. డిస్ట్రిబ్యూటర్ మొదలుకొని ఎగ్జిబిటర్ వరకూ ప్రతి ఒక్కరూ దారుణంగా నష్టపోవడంతోపాటు.. అఖిల్ కు హంసపాదులా నిలిచిన చిత్రమిది. ఆ సినిమా ద్వారా నష్టపోయిన డబ్బు కంటే.. దెబ్బతిన్న బంధాలు ఎక్కువ. పైకి చెప్పకపోయినా నితిన్-నాగార్జున ఫ్యామిలీల మధ్య దూరం పెరిగింది.
కథ ఎంపికలో జరిగిన తప్పిదమో లేక మరొకటో తెలియదు కానీ.. సినిమా ఘోర పరాభవానికి అఖిల్ కంటే ఎక్కువగా బాధపడిన వ్యక్తి నితిన్. ఆ బాధతో నితిన్ ఓ రెండు మూడు నెలలు సరిగా నిద్ర కూడా పోలేదంట. ఆ పశ్చాతాపంతోనే ఎప్పటికైనా అఖిల్ తో ఒక సినిమా తీసి సూపర్ హిట్ ఇవ్వడమే తన ధ్యేయం అంటున్నాడు నితిన్. “లై” ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నితిన్ ఈ వ్యాఖ్యలు చేయడం అందర్నీ కదిలించింది. తాను నష్టపోయినడానికంటే.. తన సినిమా ద్వారా ఫ్లాప్ అందుకొన్న అఖిల్ కోసం నితిన్ బాధపడడం గమనార్హం. చూద్దాం.. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా మళ్ళీ ఎప్పుడొస్తుందో.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.