మనకంటే పనిచేసే ఆఫీసుల్లో నెల పూర్తయ్యాక కూడా సాలరీలు ఇవ్వడానికి ఇబ్బందులుపడుతుంటారు కానీ.. ఇండస్ట్రీలో హీరోహీరోయిన్స్ కి మాత్రం అడ్వాన్స్ డబ్బులు తెగ ఇచ్చేస్తుంటారు. మన ఇండస్ట్రీలోని ప్రతి సక్సెస్ ఫుల్ హీరోహీరోయిన్ మరియు డైరెక్టర్ దగ్గర కనీసం అయిదారుగురు నిర్మాతల డబ్బులు అడ్వాన్స్ రూపంలో ఉంటాయి. ఇది చాలా సర్వసాధారణం. కానీ.. ఓ యువ నిర్మాతను మాత్రం ఈ అడ్వాన్స్ వ్యవహారం ఇరుకున పడేసింది. సుధీర్ బాబు హీరోగా రిజ్వాన్ అనే నిర్మాత ఓ సినిమా ప్రారంభించాడు. ఆ సినిమాలో సుధీర్ సరసన మెహరీన్ ను హీరోయిన్ గా ఎంపిక చేసి ప్రారంభోత్సవం కూడా ఘనంగా నిర్వహించాడు.
కానీ.. ప్రోజెక్ట్ నుంచి సుధీర్ బాబు తప్పుకోవడంతో అతడి స్థానంలో మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ వచ్చాడు. కళ్యాణ్ సరసన నటించడం ఇష్టం లేని మెహరీన్ ఆ ప్రొజెక్ట్ నుంచి తప్పుకొంది. అక్కడివరకు బాగానే ఉంది కానీ.. ఇప్పుడు నిర్మాత ఇచ్చిన డబ్బులు మాత్రం వెనక్కి ఇవ్వను అంటోంది. దాంతో ఆ యువ నిర్మాత ఫిలిమ్ ఛాంబర్ ను సంప్రదించాడట. మరి ఈ మేటర్ ఎక్కడివరకూ వెళ్తుందో తెలియదు కానీ.. అసలే చాలా కాలంగా సరైన హిట్ లేక ఇబ్బందిపడుతున్న మెహరీన్ ప్రాణానికి సంకటంలా మారింది.