ఒక్కోసారి సరదాగా సెలబ్రిటీలు మాట్లాడే మాటలు చాలా దూరం వెళ్తాయి. అప్పట్లో చలపతి బాబాయి సరదాగా అమ్మాయిల గురించి మాట్లాడుతూ.. “అమ్మాయిలు హానికరం కాదు కానీ.. పక్కలోకి పనికొస్తారు” అని చేసిన స్టేట్ మెంట్ రచ్చ రచ్చ చేసి ఆఖరికి స్వయంగా చలపాయ్ బాబాయ్ “నన్ను క్షమించండి పొరపాటున అనేశాను” అంటూ లైవ్ లో ప్రాధేయపడేలా చేశారు మహిళా సంఘాలు, నెటిజన్లు. తాజాగా తమిళ దర్శకుడు మిస్కిన్ కూడా తాను చేసిన సరదా కామెంట్స్ కారణంగా తలపోట్లు ఎదుర్కొంటున్నాడు.
ఇటీవల మమ్ముట్టి నటించిన “పెరుంబు” ఆడియో విడుదల వేడుక పలువురు ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ ఆడియో విడుదల వేడుకకు ముఖ్య అతిధిగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు మిస్కిన్ “పెరుంబు” ట్రైలర్ చూసి “ఈ సినిమాలో మమ్ముట్టిని చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఒకవేళ మమ్ముట్టి గనుక అమ్మాయి అయ్యుంటే తప్పకుండా వెంబడేవాడిని, ఒకవేళ నేను అమ్మాయిని అయితే తప్పకుండా అతడ్ని రేప్ చేసేవాడ్ని” అని చేసిన స్టేట్ మెంట్ వైరల్ అయ్యింది. నెటిజన్లు అందరూ మిస్కిన్ పై విరుచుకుపడుతున్నారు. మరి మమ్ముట్టి స్వయంగా వచ్చి ఏదైనా స్టేట్ మెంట్ ఇస్తే తప్ప ఈ గొడవ ఇప్పుడప్పుడే సర్ధుమణిగేలా లేదు.