Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

సినిమాకు, రాజకీయాలకు సంబంధం ఉంది అనే విషయంలో మీకేమైనా డౌట్స్‌ ఉంటే.. రీసెంట్‌గా తెలుగు రాష్ట్రాల మధ్య, తెలుగు రాష్ట్రాల భాషాభిమానుల మధ్య, తెలుగు రాష్ట్రాల మనోభావాల మధ్య, తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకుల మధ్య, తెలుగు రాష్ట్రాల ట్రోలర్ల మధ్య, తెలుగు రాష్ట్రాల నెటిజన్ల మధ్య, తెలుగు రాష్ట్రాల సినీ అభిమానుల మధ్య జరిగిన, జరుగుతున్న, ఇంకొన్నాళ్లు జరగబోయే ‘ఇడుపు కాయితం’ చర్చను చూడండి మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సినిమా అభిమానుల మధ్య మొదలైన ఈ చర్చ.. ఇప్పుడు పైన చెప్పిన రంగాలు/ విభాగాల మధ్య నడుస్తోంది.

Idupu Kayitham

ఈ చర్చ మొదలుపెట్టిన వాళ్లు ఎప్పుడో వదిలేశారు.. కానీ ఈ చర్చను ముందుకు నడిపిస్తున్న వాళ్లు.. ఆ చర్చ ఇంకెంత దూరం తీసుకెళ్తారో అర్థం కాని టాలీవుడ్‌లో నెలకొంది. అవును, మీరు చదివింది నిజమే. ఎందుకంటే ‘ఇడుపు కాయితం’ పంచాయితీ ఇప్పుడు సినిమా పరిశ్రమ నుండి దాటిపోయింది అనిపిస్తోంది. రీసెంట్‌ టైమ్స్‌లో చూస్తే ఈ విషయంలో ఎక్కువగా స్పందిస్తోంది తెలంగాణ భాషాభిమానులు, తెలంగాణ రాజకీయ నాయకులే. వారి మనోభావాలు దెబ్బ తిన్నాయి కాబట్టి వాళ్లు అలా చేయడంలో తప్పు లేదు.

కానీ ‘ఇడుపు కాయితం’ సినిమాకు సబ్‌ టైటిల్స్‌ వేస్తారా అనే చర్చ మొదలుపెట్టినవారిదే తొలి తప్పు. దానికి మలయాళ సినిమా పరిశ్రమతో లింక్‌ చేసి ఈ చర్చను పెద్ద ఎత్తున పంచాయితీ చేసింది ఆ కొందరే. ఈ క్రమంలో రేగిన మాటల తూటాలు తెలుగు రాష్ట్రాల మధ్య అన్‌రెస్ట్‌ని క్రియేట్‌ చేశారు. తెలంగాణ యాస, భాషల మీద తెలుగులో సినిమాలు రావడం కొత్తేమీ కాదు. గతంలో చాలా సినిమాలు వచ్చాయి. అందులో చాలా తెలంగాణ పడికట్టు పదాలు, మాటలు చాలానే ఉన్నాయి.

‘ఫిదా’ సినిమాలో ‘పుక్కిట్ల’ తదితర మాటలు చాలానే ఉన్నాయి. ‘బలగం’ సినిమాలో అయితే ఇలాంటి పదాలు బోలెడు. వాటన్నింటి విషయంలో రాని చర్చ ఇప్పుడెందుకు వచ్చింది? అప్పుడు రాని సబ్‌టైటిల్స్‌ గొడవ ఇప్పుడెందుకు వచ్చింది? అప్పుడు రాని మనోభావాల పంచాయితీ ఇప్పుడెందుకు వచ్చినట్లు. అప్పుటికి, ఇప్పటికి ఇతర ప్రాంతాల వారికి తెలంగాణ యాస, మాట అర్థం చేసుకునే జ్ఞానం తగ్గిపోయిందా? లేదు కదా? అంటే ‘ఇడుపు కాయితం’ పంచాయితి రేపి సోషల్‌ మీడియాలో సినిమా పేరు బాగా నానేలా చేశారు అని చెప్పుకోవచ్చు. అయితే ఆ చర్చ అనూహ్యంగా పొలిటికల్‌ టర్న్‌ తీసుకొని అటు వెళ్లిపోయింది.

ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus