స్కిన్ షో మొత్తం స్క్రిప్ట్ కోసమే..!

“స్క్రిప్ట్ డిమాండ్ చేయడంతో తప్పలేదు” అనే మాట ఇండస్ట్రీలో ముఖ్యంగా హీరోయిన్ల దగ్గర వింటూనే ఉంటాం. బికినీలు వేయడం, హీరోలతో లిప్ లాక్ లు లాంటి అసాంఘిక (సెన్సార్ బోర్డ్ వరకూ) కార్యకలాపాలకు పాల్పడినప్పుడు భాషతో సంబంధం లేకుండా సౌత్ హీరోయింలందరూ చెప్పే అత్యంత సాధారణమైన డైలాగ్ ఇది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఇదే డైలాగ్ చెబుతోంది సౌత్ హాట్ బ్యూటీ లక్ష్మీ రాయ్. చాలా కాలం తర్వాత బాలీవుడ్ లో హీరోయిన్ గా అవకాశం అందుకొన్న లక్ష్మీ రాయ్ ఏమాత్రం అభ్యంతరం లేకుండా తన అందాలను అత్యంత ఉదారంగా ఆరబోసింది. లెక్కకు మిక్కిలి బికినీలతోపాటు లెక్కపెట్టలేనన్ని లిప్ లాక్ లు కూడా అమ్మడు ఇచ్చిందని తెలుస్తోంది. ఇంకో సెన్సేషన్ సంగతి ఏంటంటే.. లక్ష్మీ రాయ్ ఈ సినిమాలో ఓ నాలుగు టాప్ లెస్ సీన్స్ లోనూ యాక్ట్ చేసిందని వినికిడి. బాలీవుడ్ ఏ రేటెడ్ సినిమాలకు ఎలాగో బ్లర్ చేయడం లాంటివి ఉండవు కాబట్టి.. బాలీవుడ్ జనాలకి లక్ష్మీ రాయ్ అందాలు ఆరేసిన ఇస్తరాకు లాంటివి.

అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో లక్ష్మీ ఓ హీరోయిన్ గా నటిస్తోంది. స్టార్ హీరోయిన్ అవ్వడం కోసం ఓ గ్లామర్ లేడీ పడిన పాట్లు (మెంటల్ గా, ఫిజికల్ గా) ఆన్ స్క్రీన్ ప్రెజంట్ చేస్తోంది. ఇదివరకూ ఈ తరహా కథలతో చాలా సినిమాలోచ్చినప్పటికీ.. ఈ సినిమాకి మాత్రం లక్ష్మీ రాయ్ గ్లామరే ప్రధాన ఆకర్షణగా విడుదలవుతోంది. చూద్దాం మరి రాయ్ లక్ష్మీ గ్లామర్ డోస్ బాక్సాఫీస్ కలెక్షన్ల విషయంలో ఏమేరకు ఉపయోగపడుతుందో.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus