ఒకప్పుడు టాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ ఇలియానా. ఈ ముద్దుగుమ్మ కెరియర్ మొదట్లోనే మంచి విజయాలు సాధించి టాప్ హీరోయిన్ గా ఎదిగింది. టాలీవుడ్ లో క్రేజ్ సంపాదించినా తరువాత బాలీవుడ్ లో అదృష్టం కలసి రాక చాలా రోజులుగా తెగ ఇబ్బందిపడిపోయియింది. ఇక హీరో రవితేజ పుణ్యమా అని ఆరు సంవత్సరాల గ్యాప్ తరువాత ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమా ద్వారా మళ్ళీ తెలుగు ప్రేక్షకులకి దగ్గరవుతుంది. ఇక ఇన్ని సంవత్సరాల తరువాత రి ఎంట్రీ ఇస్తున్న ఇలియానా ఇప్పటివరకు తన సినీప్రయాణం ఎలా ఉందనే విషయాల గురించి వివరించింది.
ఇలియానా కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ అనగానే అందరికి గుర్తొచ్చేది ‘పోకిరి’ సినిమా. అయితే ఈ విషయం పైన ఇలియానా అసలు నాకు మొదటగా పోకిరి సినిమాలో నటించడం అసలు ఇష్టమే లేదు కానీ మహేష్ బాబు సిస్టర్ మంజుల నన్ను ఒప్పించడంతో సినిమా చేసానని చెప్పింది. సినిమా రిలీజ్ అయిన తరువాత ఆ రేంజులో హిట్ అవుతుందని ఊహించలేదని, ఇలా నేను ఇష్టం లేకుండా చేసిన సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టగా, చాలా ఇష్టంగా చేసిన కొన్ని సినిమాలు ప్లాప్ అయ్యాయని, ఇప్పటినుండి ఏ సినిమా చేసిన దానినుండి ఏదోకటి నేర్చుకుంటూ ముందుకు వెళతాను అంటూ చెప్పుకొచ్చింది.