హీరోయిన్ ఇలియానా పేరు చెప్పగానే.. అందరికీ ‘పోకిరి’ సినిమానే గుర్తొస్తుంది. సన్నని నాజూకు నడుముతో ప్రేక్షకు ల్ని ఫిదా చేసిన ఆ భామ, ఆ తర్వాత అల్లు అర్జున్, పవన్ కల్యాణ్ లాంటి స్టార్ హీరోలతో నటించి హిట్స్ కొట్టింది. కొత్త హీరోయిన్ల రాకతో కొన్నాళ్లు బాలీవుడ్ లో మూవీస్ చేసింది. కానీ ప్రస్తుతానికైతే ఎలాంటి ప్రాజెక్టులు చేతిలో లేవు. దీంతో అందరూ ఆమెని మర్చిపోయారు. అలాంటిది సడన్ గా తాను ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది.
ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక విషయానికొస్తే.. ఇలియానా ముంబయిలో పుట్టి పెరిగింది. ఆమెకు పదేళ్లున్నప్పుడు ఫ్యామిలీ మొత్తం గోవా వెళ్లిపోయి అక్కడే సెటిలైపోయారు. టీనేజ్ లోనే మోడలింగ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె.. చాలా చిన్న వయసులోనే పలు యాడ్స్ లో నటించేసింది. అలా డైరెక్టర్ వైవీఎస్ చౌదరి కంట్లో పడింది. దీంతో తన ‘దేవదాసు’ మూవీలో ఛాన్స్ ఇచ్చాడు. ఆ వెంటనే పూరీ జగన్నాథ్ ‘పోకిరి’లో హీరోయిన్ గా చేసింది.
అలా 2006-12 మధ్య తెలుగులో సినిమాలు చేసిన ఇలియానా.. ఆ తర్వాత టాలీవుడ్ లో ఛాన్సులు రాక బాలీవుడ్ కి షిప్ట్ అయిపోయింది. బాలీవుడ్ లో నాలుగైదేళ్ల పాటు సినిమాలు చేసింది. కానీ పెద్దగా గుర్తింపు అయితే రాలేదు. దీనికి తోడు వెయిట్ కూడా పెరిగిపోవడం ఇలియానాకు కాస్త మైనస్ గా మారిపోయింది. అలా ఏదో ఒకటో రెండు సినిమాలు చేస్తూ వచ్చిన ఇలియానా.. గతంలో పోర్చుగల్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో ఈమె డేటింగ్ లో ఉన్నట్లు వార్తలొచ్చాయి.
రీసెంట్ గా హీరోయిన్ కత్రినా కైఫ్ బ్రదర్ తో రిలేషన్ షిప్ లో ఉందనే రూమర్స్ వచ్చాయి. పెళ్లి గురించి అసలు టాపిక్కే లేకుండా డైరెక్ట్ గా తాను ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ఇలియానా పోస్ట్ పెట్టింది. దీనికి వాళ్ల అమ్మ కూడా గ్రాండ్ బేబీ అని కామెంట్ పెట్టడం విశేషం. మరి ఇలియానా పెళ్లి కాకుండానే తల్లి కావడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!
బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!