సినిమాలు లేక పోవడంతో ఇలియానా తన బాయ్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తోంది. దేవదాస్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ భామ పోకిరితో కుర్రకారుల మనసు దోచుకుంది. జల్సా, కిక్, జులాయి వంటి విజయాలను తన ఖాతాలను వేసుకుంది. బాలీవుడ్ నుంచి అవకాశం రావడంతో టాలీవుడ్ కి టాటా చెప్పింది. బర్ఫీ సినిమాతో హిందీ పరిశ్రమలోకి ప్రవేశించి మంచి నటిగా పేరు తెచ్చుకుంది.
ప్రస్తుతం హిందీలో అక్షయ్‌కుమార్‌తో ‘రుస్తూమ్’ చిత్రంలో నటిస్తోంది. ఈ ఒక్క చిత్రం తప్ప ఆమె చేతిలో మరో సినిమా లేదు. దీంతో ఇలియానా తన ప్రియుడు ఆండ్రూ నీబోన్ తో సరదాగా గడుపుతోంది. అంతే కాదు వారిద్దరు కలిసున్న ఫోటోలను సోషల్ మీడియా లో పెట్టింది. “మొనాకో చాలా బాగుంది. ఇక్కడి అందాలను వర్ణించడానికి మాటల చాలవు.” అంటూ పోస్ట్ చేసింది. తన బాయ్ ఫ్రెండ్ గురించి మాత్రం ఏమి చెప్పలేదు.
ఈ ఫొటోలు చూసిన వారు ఇలియానాకు కళ్యాణ గడియలు వచ్చినట్లు చెప్పుకుంటున్నారు. ఈ మాటలను ఇలియానా సన్నిహితులు కొట్టిపడేస్తున్నారు. ఇప్పట్లో సినిమా కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టే ఆలోచన ఇలియానాకు లేదని, మంచి కథలు వస్తే తెలుగులో కూడా మళ్ళీ నటించేందుకు ఆమె సిద్దమని వెల్లడించారు.