నాగ్ కి ఛాన్స్ ఇవ్వట్లేదట!

Advertisement

గౌత‌మ్ మీన‌న్‌ లాంటి దర్శకుడితో పని చేయాలని ప్రతి హీరో అనుకుంటాడు. ప్రేమ‌క‌థ‌,యాక్ష‌న్ స్టోరీ, క్రైమ్ స్టోరీస్ ఇలా ఏ జోనర్ సినిమాలైనా.. చేయగలిగే సత్తా ఆయనలో ఉంది. ఎందఱో హీరోలకు బ్రేక్ ఇచ్చింది కూడా ఆయనే. అక్కినేని నాగచైతన్య తో ‘ఏ మాయ చేసావే’ సినిమాను రూపొందించి చైతు కెరీర్ కు ఓ దారి చూపించారు.

అయితే చైతు తండ్రి నాగార్జున‌కీ గౌత‌మ్‌తో ప‌నిచేయాల‌ని చాలాసార్లు అనిపించింద‌ట‌. గౌత‌మ్ కూడా… ‘సార్ మీతో ఓ సినిమా చేస్తా’ అనేవాడ‌ట‌. ‘ఈ సినిమాలో నెగెటివ్ క్యారెక్ట‌ర్ ఉంది చేస్తారా?’ అని అడిగి… తరువాత మాయమైపోయేవాడట. నాగ్ నెగిటీవ్ పాత్ర‌లు చేయ‌డానికి సిద్ధ‌ప‌డినా గౌత‌మ్‌.. న‌మ్మించి మాయ చేసేవాడ‌ట‌.

‘నాతో ఒక్క సినిమా కూడా చేయ‌లేదు.. మా అబ్బాయితో రెండు సినిమాలు పూర్తి చేసావ్. నాతో ఎప్పుడు చేస్తావ్ గౌత‌మ్‌. నీ కోసం ఇంకా ఎదురుచూస్తున్నా’ అంటున్నాడు నాగార్జున‌. మరి ఇప్ప‌టికైనా గౌతమ్ మీనన్, నాగార్జున కోసం కథ రెడీ చేస్తాడేమో.. చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus