క్యాన్సర్ తో పోరాడి గెలిచిన సెలబ్రిటీస్

కొన్నేళ్ల క్రితం ప్రేక్షకులను ఏడిపించడానికి దర్శకులు సినిమాలోని హీరోకి గాని, హీరోయిన్ కి గాని క్యాన్సర్ రప్పించేవారు. పూర్తిగా నయం చేయలేని ఆ మహమ్మారి బారిన పడిన కథానాయకుడి అవస్థలు పడి అభిమానులు కన్నీరు కార్చేవారు. అటువంటి కథలతో వచ్చిన సినిమాలు ఎన్నో విజయం సాధించాయి. విచిత్రం ఏమిటంటే సినిమాలో క్యాన్సర్ తో పోరాడలేక చనిపోతే. రియల్ లైఫ్ లో క్యాన్సర్ వచ్చిన తారలు వాటికి ఎదురునిలిచి గెలిచి చూపించారు. అలా క్యాన్సర్ కి ఎదురు నిలిచిన సెలబ్రిటీస్ పై ఫోకస్..

అక్కినేని నాగేశ్వరరావు క్యాన్సర్ గురించి ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు ముందుగా చెప్పుకోవాల్సిన స్టార్ అక్కినేని నాగేశ్వరరావు. ఆయనకు 90 ఏళ్ళ వయసులో క్యాన్సర్ సోకిందని తెలియగానే భయపడకుండా ఆ వ్యాధితో బాధపడుతూనే అభిమానులకు మనం వంటి అద్భుతమైన సినిమాని ఇచ్చారు. ఆయన దైర్యం ఎంతో మందికి స్ఫూర్తి ఇచ్చింది.

ముంతాజ్ అలనాటి బాలీవుడ్ నటి ముంతాజ్ 26 వ ఏటనే బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడింది. అయినా దైర్యంగా వైద్యం చేయించుకుంటూ, సినిమాల్లో నటిస్తూ అభిమానులను అలరించింది. ముప్పైఏళ్ళపాటు పోరాడి అలసిపోయి ప్రాణాలు విడిచింది.

గౌతమి 1990 లో హీరోయిన్ గా అలరించిన గౌతమికి 35 ఏళ్ళ వయసులో బ్రెస్ట్ క్యాన్సర్ సోయింది. అయినా భయపడకుండా చికిత్స పొంది, ఆరోగ్యవంతురాలు అయింది. క్యాన్సర్ బాధితులు ఎందరికో గౌతమి స్ఫూర్తిగా నిలిచింది.

లీసారే భారత్ లోని అందమైన మోడల్స్ లో లీసారే ఒకరు. హీరోయిన్ గా అనేక సినిమాల్లో నటించింది. ఏమిదేళ్ళ క్రితం ఆమెకు క్యాన్సర్ వచ్చింది. ఆమె కుటుంబసభ్యులు, అభిమానులు కంగారుపడ్డారు. లీసారే మాత్రం ఆందోళన చెందకుండా దైర్యం గా ట్రీట్ మెంట్ తీసుకొని క్యాన్సర్ ని తరిమి కొట్టింది.

మనీషా కొయిరాలా నెల్లూరి నెరజాణ గా తెలుగు ప్రజలకు పరిచయమైన నేపాలీ బ్యూటీ మనీషా కొయిరాలా. బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగింది. పెళ్లి అయిన తర్వాత ఆమెకు గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ ఉన్నట్లు తెలిసింది. వెంటనే భర్తకు విడాకులు ఇచ్చి న్యూ యార్క్ లో చికిత్స తీసుకుంది. ఒంటరిగా క్యాన్సర్ పై పోరాడి గెలిచింది.

మమతా మోహన్ దాస్ మలయాళ కుట్టీ మమతా మోహన్ దాస్ హీరోయిన్ గా, సింగర్ గా నిరూపించుకుంది. ఆమెకు చాలా తక్కువ వయసులోనే క్యాన్సర్ వచ్చింది. అయినా నటనకు తాత్కాలికంగా గుడ్ బై చెప్పి, వైద్యం తీసుకుని ఇప్పుడు ఆరోగ్యవంతురాలు అయింది. త్వరలోనే మమతా మోహన్ దాస్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతుంది.

యువరాజ్ సింగ్ క్రికెట్ గ్రౌండ్ లో సిక్స్ లు బాధే యువరాజ్ సింగ్ కెరీర్ ని లంగ్ క్యాన్సర్ అడ్డుకోవాలని చూసింది. బ్యాట్ వదిలి పారిపోతాడని అనుకుంది. యువరాజ్ తన అమ్మ ఇచ్చిన ధైర్యంతో అమెరికా వైద్యుల సహకారంతో మహమ్మారిని తరిమేశాడు. క్రీజ్ లోకి వచ్చి సిక్స్ ల వర్షం కురిపిస్తున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus