రష్మిక మందన సినిమాల లైనప్‌లో మొన్నీ మధ్య వరకు ఓ సినిమా గురించి తక్కువగా మాట్లాడుకున్నారు. కానీ ఇప్పుడు బయటకు వచ్చిన ఓ లీక్‌తో ఇప్పుడు ఆ సినిమా గురించే మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆ సినిమాలో రష్మిక స్వలింగ ప్రేమికురాలిగా కనిపిస్తోంది అని. అంటే మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. అదేనండీ లెస్బియన్ లవర్‌గా కనిపిస్తుంది అని. ఆ సినిమా బాలీవుడ్‌లో ప్రస్తుతం తెరకెక్కుతున్న ‘కాక్ టెయిల్ 2’. నిజానికి ఈ సీక్వెల్ సినిమా తొలి పార్టు గురించి తెలిసినవాళ్లకు ఈ సినిమాలో ఇలాంటి ట్విస్ట్ ఏదో ఉంటుంది అని ఊహించే ఉంటారు.
‘కాక్‌టెయిల్ 2’ సినిమాలో షాహిద్ కపూర్ ప్రధాన పాత్రధారుడు. ఇందులో రష్మికతోపాటు కృతి సనన్ కూడా నటిస్తోంది. అలా అని ఈ సినిమా ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయితే కాదు. ఎందుకంటే ఈ సినిమాలో కృతి, రష్మిక స్వలింగ ప్రేమికులుగా కనిపిస్తారు అని బాలీవుడ్ వర్గాల టాక్. దీనిపై ఇంకా అధికారిక సమాచారం రానప్పటికీ వీరి పాత్రల గురించి ప్రచారం సాగుతోంది. హోమీ అదజానియా దర్శకత్వంలో ‘కాక్‌టెయిల్ 2’ రూపొందుతోంది. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారట.
2012లో సైఫ్ అలీ ఖాన్, దీపికా పదుకొణె, డయానా పెంటీ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘కాక్ టెయిల్’. ఆ సినిమాకు సీక్వెలే ఇప్పుడు రూపొందుతున్న ‘కాక్ టెయిల్ 2’. తొలి సినిమాలో దీపిక, డయానా తరహాలో ఇప్పుడు కృతి, రష్మిక ఫ్రెండ్స్‌లా ఉంటారు అనుకున్నారంతా. కానీ ఇప్పుడు వచ్చిన కొత్త టాపిక్ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
మరి నిజంగానే రష్మిక ఇలాంటి పాత్రలో నటిస్తోందా? పెళ్లికి (విజయ్ దేవరకొండతో) ముందు ఇలాంటి పాత్రలు అవసరమా? అనేది ఆమెకే తెలియాలి. ఏముంది పెళ్లి పని పెళ్లిదే, యాక్టింగ్ పని యాక్టింగ్‌దే అంటారా.. అయితే ఓకే. కానీ రిస్కీ సబ్జెక్ట్‌తో రష్మిక ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రానుంది. క్లిక్ అయితే ఆమెకు అవార్డులు, రివార్డులు పక్కా.