మార్చి 2వ తారీఖు నుంచి ఇండస్ట్రీ బంద్ అని.. షూటింగులు చేయడం కానీ, సినిమా కంటెంట్ ను డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ (DSP)లకు ఇవ్వడం కానీ చేయబోమని ప్రకటించడమే కాక.. యూ.ఎఫ్.ఓ మరియు క్యూబ్ సంస్థలు నిర్మాతలను దోచుకోవడం ఆపకపోతే అసలు సినిమాలు రిలీజ్ చేయడమే మానేస్తామని చిన్నసైజు యుద్ధం ప్రకటించారు. అందుకు సంబంధించి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ తోపాటు ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు.
కట్ చేస్తే.. కొందరు నిర్మాతలు మాత్రం తమ సినిమాల రిలీజ్ డేట్ లను ఎప్పట్లానే ప్రకటించుకొంటున్నారు. మార్చి 2న “దండుపాళ్యం 3”, మార్చి 3న “కణం” రిలీజ్ చేస్తుండగా.. మార్చి 9న విజయ్ దేవరకొండ “ఏమంత్రం వేసావే”, మార్చి 16న “కిర్రాక్ పార్టీ” చిత్రాలను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మరి నిర్మాతల మధ్య సరైన క్లారిటీ లేకపోవడం వల్లనా లేక మా సినిమాలు మా ఇష్టం అంటూ నిర్మాతలు వారి వారి సినిమాలను రిలీజ్ చేయాలని ఆలోచించడం వల్లనా అనే తెలియడం లేదు కానీ.. ఒకపక్క ఇండస్ట్రీ బంద్ అని ప్రకటించి.. మరోపక్క ఇలా వరుసబెట్టి సినిమాలని రిలీజ్ చేయడం అనేది ఎంతవరకూ సమంజసం అనేది ఇండస్ట్రీ పెద్దలు కాస్త వీలు చూసుకుని చర్చించాల్సిన విషయం.