Rakul Preet Singh: రకుల్ ప్రీత్‌కి చేదు అనుభవం.. విడ్డూరంగా ఇన్‌ఫ్లూయెన్సర్ మాటలు
- February 24, 2026 / 12:18 PM ISTByFilmy Focus Desk
ఓ అవార్డుల ఫంక్షన్‌లో అవార్డులు అందుకోవడం ఎంత ఆనందంగా ఉంటుందో.. ఆ అవార్డు ఇచ్చేవారికి ఎంతో గౌరవంగా ఉంటుంది. అలాంటిది అవార్డు ఇచ్చే వ్యక్తికి గౌరవం ఇవ్వకపోతే ఎంత ఇబ్బందిగా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు ఇదే పరిస్థితిలో ఉంది ప్రముఖ కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్. ఇటీవల జరిగిన ఓ అవార్డుల ప్రదానోత్సవంలో రకుల్‌కు చేదు అనుభవం ఎదురైంది. అవార్డు అందుకోవడానికి వచ్చిన ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లూయెన్సర్ లక్ష్య జగ్గీ అవార్డు తీసుకొని గౌరవార్థం షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Rakul Preet Singh
ఈ వీడియోపై లక్ష్య జగ్గీ రియాక్ట్ అయ్యాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. ‘‘మీరందూ రకుల్ ప్రీత్ సింగ్ సంఘటన గురించి అందరూ మాట్లాడుతున్నారు. ఆ రోజు నేను అవార్డు తీసుకోవడానికి వెళ్లినప్పుడు అక్కడ స్టేజీ మీద మరొకరు అవార్డు తీసుకున్నారు. ఆమె రకుల్ నుంచి అవార్డు తీసుకున్నాక షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తే.. రియాక్షన్ లేదు. అది గమనించిన నేను అవార్డు తీసుకున్నాక షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నించలేదు అని చెప్పాడు.
తనకు ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదని.. ఆ సమయానికి అలా అనిపించి అవార్డు తీసుకొని వెళ్లిపోయానని చెప్పాడాయన. అయితే, ఆ ఈవెంట్‌ని చూసినవాళ్లు అలాంటిదేం లేదు అని సోషల్ మీడియాలో చెబుతుండటం గమనార్హం. లక్ష్య జగ్గీ కావాలనే సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి ప్రయత్నించాడని కామెంట్లు చేస్తున్నారు. వైరల్ వీడియోలో రకుల్ ఎక్స్‌ప్రెషన్ చూసినవారికి ఆమె షేక్ హ్యాండ్ ఇవ్వడానికి సిద్ధమయ్యారని అర్థమవుతోంది. కానీ ఇన్‌ఫ్లూయెన్స్ ఇంకోలా చెబుతున్నాడు. మరి అక్కడేం జరిగింది అనేది ఆ ఈవెంట్ నిర్వహించినవారు లేదంటే రకుల్ ప్రీత్ సింగ్ మాత్రమే చెప్పగలరు.












