ఒక్కడిగా కనిపించే నాలుగురా..నలుగురిలా కనిపించే ఒక్కడా..!

  • February 8, 2020 / 07:31 PM IST

విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వరల్డ్ ఫేమస్ లవర్ అనగానే ఈ మూవీపై అసలు ఎటువంటి అంచనాలు లేవు. ఐతే టీజర్ విడుదల తరువాత ఒక్కసారిగా స్టోరీ మారిపోయింది. నలుగురు హీరోయిన్స్ తో వివిధ గెటప్స్ లో ఉన్న విజయ్ లవ్ స్టోరీస్ మూవీపై ఆసక్తి రేపేలా చేశాయి. రాశి ఖన్నా రోల్ బోల్డ్ గా ఉండటం మరింత హైప్ క్రియేట్ చేసింది. ఐతే వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ స్టోరీ ఏమై ఉంటుంది అనేది అంతుబట్టడం లేదు. సాధారణంగా ట్రైలర్ విడుదల తరువాత మూవీపై ఓ ఆవాహన వస్తుంది. కానీ వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం విషయంలో మాత్రం కథ ఊహకు అందడం లేదు.

ఇక్కడ విజయ్ క్యాథరిన్ దగ్గర కార్మికుడు శీనయ్యగా పనిచేస్తూ ప్రేమాయణం నడిపిస్తున్నాడు. ఇక మధ్య తరగతి పల్లెటూరి భార్య ఐశ్వర్య రాజేష్ భర్తగా కనిపిస్తున్నాడు. ఇసాబెల్లా తో అల్ట్రా మోడ్రన్ పాష్ లైఫ్ అనుభవించే కుర్రాడిగా కనిపిస్తున్నాడు. రాశి ఖన్నా విషయంలో మాత్రం ఆయన లవ్ ఫెయిల్యూర్ అయిన భగ్న ప్రేమికుడిగా కనిపిస్తున్నాడు. ఈ చిత్ర నిర్మాత కె ఎస్ రామారావు ఓ ఇంటర్వ్యూ లో ఆ నలుగురు అమ్మాయిల పాత్రల మధ్య కాంబినేషన్ సీన్స్ కానీ, కథలో సంఘర్షణ కానీ ఉండదు అని చెప్పారు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ వివిధ స్టేజ్ లలో నలుగురు అమ్మాయిలతో లవ్ స్టోరీస్ నడిపి ఉండాలి. కానీ ఇక్కడ విజయ్ పాత్ర అటు క్లాస్ గా ఇటు మాస్ గా రెండు షేడ్స్ లో కనిపిస్తుంది. కాబట్టి విజయ్ ఒక్కడే కాదనిపిస్తుంది. విజయ్ డ్యూయల్ రోల్ అయిన క్రమంలో క్యాథరిన్- ఐశ్వర్య రాజేష్ లది ఒక ఎపిసోడ్, ఇసబెల్లా-రాశి ఖన్నాలది ఒక ఎపిసోడ్ అయ్యే అవకాశం కలదు. మళ్ళీ విజయ్ నలుగురు అమ్మాయిలతో నాలుగు పేర్లతో పరిచయం అయిన క్రమంలో డ్యూయల్ రోల్ అని కూడా చెప్పలేం. ఇలా వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ కథ ఏమై ఉంటుంది అనే విషయం అంతుబట్టడం లేదు.

Most Recommended Video

జాను సినిమా రివ్యూ & రేటింగ్!
సవారి సినిమా రివ్యూ & రేటింగ్!
అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
ఎన్టీఆర్ ఆస్తుల వివరాలు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus