టైటిల్‌లో నాగాలాండ్ సినిమా చూసి.. నాగాలాండ్ ప్రాంతంలో ఎవరో తీసిన సినిమా అనుకునేరు. ఇది నాగాలాండ్ సినిమా పరిశ్రమ తెరకెక్కించిన సినిమా ఇది. ఇదెప్పుడు పెట్టారు మాకు తెలియదే అనుకుంటున్నారా.. అలా తెలియని వారికి ఫుల్ క్లారిటీ ఇచ్చేయబోతోంది ఓ నాగాలాండ్ సినిమా. ఆ సినిమా పేరే ‘అంగ్’. ఈ సినిమా అనూహ్యంగా ఆస్కార్ రేసులోకి దూసుకొచ్చింది. ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిలిం కేటగిరీ కోసం ఈ సినిమా బరిలో నిలవనుంది.
‘అంఘ్’ అనే నాగాలాండ్ సినిమా గురించి మన దేశంలో ఇప్పటివరకు విడుదల కాలేదు. కానీ ప్రతిష్ఠాత్మక టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్లాట్‌ఫాం ప్రైజ్ సొంతం చేసుకు ఆశ్చర్యపరిచింది. ప్రపంచవ్యాప్తంగా 12 చిత్రాలు పోటీపడగా, భారత్ నుంచి బరిలో నిలిచిన ఏకైక చిత్రం ఇదే. ఈ అవార్డుతో ఆస్కార్ పురస్కారాల్లో ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిలిం కేటగిరీ కోసం పరిశీలనకు ఎంపికయ్యే అర్హతను కూడా ఆ సినిమా సాధించింది.
అస్కార్ అవార్డులకు సంబంధించి అకాడెమీ అవార్డ్స్ ఈ ఏడాది కొత్తగా ఓ నిబంధన తీసుకొచ్చింది. ఆయా దేశాల తరఫున అధికారికంగా ఎంపికైన చిత్రాలతోపాటు, ఆస్కార్ అకాడమీ గుర్తింపు పొందిన అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో అవార్డు పొందిన సినిమాలు కూడా పోటీకి అర్హత సాధిస్తాయి. అలా ఇప్పుడు ‘అంఘ్’ సినిమా ఆస్కార్ బరిలోకి దిగింది. ఆస్కార్ పోటీకి అధికారికంగా పంపే సినిమా ఎంపిక ప్రక్రియను ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చూసుకుంటుంది.
అలా ఈ ఏడాది ఫెడరేషన్ తుది జాబితాలో ‘అంఘ్’ కూడా ఉంది. అయితే ఆ సినిమా ఇంకా మన దేశంలో విడుదల కాలేదన్న కారణంతో, పక్కనపెట్టినట్లు ఫెడరేషన్ వెల్లడించింది. ఆ దారి మూసుకుపోయినా, ఇప్పుడు టొరంటో ప్లాట్‌ఫాం అవార్డుతో ‘అంఘ్’ ఆస్కార్ బరిలో నిలిచింది.
నాగాలాండ్‌లో సినిమా పరిశ్రమ ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందకపోవడంతో, సినిమా టీమ్‌కి ప్రొఫెషనల్ నటులు దొరకలేదు. దీంతో సినిమా టీమ్ గ్రామాల్లోకి వెళ్లి ఆడిషన్స్ చేశారు. ఇదే నేపథ్యంతో 2021లోనే ‘అంఘ్’ టైటిల్‌తోనే ఓ లఘు చిత్రం వచ్చింది. దానికీ అంతర్జాతీయ చిత్రోత్సవంలో అవార్డు వచ్చింది. ఆ కథకు ఇప్పుడు సినిమాగా మార్చారు.