Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

ఓ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులన్నీ పూర్తయ్యాయి.. నటీనటులు డేట్స్‌ ఓకే అయ్యాయి.. ఇంకో వారంలో షూటింగ్‌.. సెట్స్‌లో ఏర్పాట్లు అన్నీ చేసేశారు. అప్పుడు ఓ సీనియర్‌ యాక్టర్‌, సినిమా గత భాగాల్లో ముఖ్య పాత్ర పోషించిన నటుడు ముందుకొచ్చి ‘నేను సినిమా నుండి తప్పుకుంటున్నాను’ అని చెబితే ఎలా ఉంటుంది. ఏద సినిమా టీమ్‌కి అయినా అది ఓ పెద్ద షాక్‌. ఆ నటుడే అక్షయ్‌ ఖన్నా. ఇదంతా జరిగింది హిందీ సినిమా ‘దృశ్యం 3’ విషయంలోనే.

Akshaye Khanna

అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ శరణ్‌ ప్రధాన పాత్రల్లో అభిషేక్‌ పాఠక్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘దృశ్యం3: ది కన్‌క్లూజన్‌’. మలయాళంలో విజయవంతమైన ‘దృశ్యం 3’కి ఇది రీమేక్‌ అని చెబుతున్నారు. అయితే మలయాళంలా ఇక్కడ మరో పార్ట్‌ ఉండదు. ఎందుకంటే ఇదే కంక్లూజన్ కాబట్టి. మాతృకతో పోలిస్తే కథ క్లైమాక్స్‌లో మార్పులు ఉంటాయని చెప్పొచ్చు. అక్టోబరు 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరో వారంలో షూటింగ్‌ ఉందనగా, అక్షయ్‌ ఖన్నా ఈ సినిమా చేయలేనని చెప్పారు. ఆ మాటతో ఆందోళన పడలేదు కానీ, సంతోషంగా లేము. షూటింగ్‌కు ముందు ఏంటిది అనుకున్నాం. దీంతో స్క్రిప్ట్‌లో మార్పులు చేశాం. అక్షయ్‌ పాత్ర స్థానంలో కొత్త పాత్రను ప్రవేశ పెట్టాం. అలా సినిమాలోకి జైదీప్‌ అహ్లావత్‌ వచ్చారు. ఓ వారంలోనే ఈ మార్పులన్నీ జరిగిపోయాయి అని డైరక్టర్‌ చెప్పారు.

‘దృశ్యం 3’ నుంచి అక్షయ్‌ ఖన్నా వైదొలగినట్లు గత డిసెంబరులో వార్తలు వచ్చాయి. సినిమాకు సంబంధించి కొన్ని ఆలోచనలు నచ్చకపోవడం, పారితోషికం తదితర కారణాలతో ఆయన ప్రాజెక్ట్‌ తప్పుకొన్నట్లు బాలీవుడ్‌ వర్గాలు తెలిపాయి. ఇప్పుడు కారణమేంటి అనేది తెలియలేదు కాఈ.. ఆయన సినిమా నుండి తప్పుకున్నాక ఏం జరిగింది అనేది మాత్రం తెలిసింది. ఎంత కాదనుకున్నా ఇది చాలా కష్టమైన ఫేజ్‌.

తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus