Top Hero Movie: 27 ఏళ్ళ టాప్ హీరో గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు..!

  • December 9, 2021 / 05:30 PM IST

సూపర్ స్టార్ కృష్ణ గారి పని ఇక అయిపోయింది అనుకున్న టైములో ఓ అభిమాని ‘నుంబర్ వన్’ అనే చిత్రాన్ని తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టాడు. అతను ఎవరో తెలుసు కదా ఎస్వీ.కృష్ణారెడ్డి. అదే ఏడాది ‘గోవిందా గోవిందా’ చిత్రంతో నష్టాలు పాలైన నిర్మాత అశ్వినీ దత్ గారికి ‘శుభలగ్నం’ అనే చిత్రం చేసి ఆయనకి భారీ లాభాలు దక్కేలా చేసాడు. అంతేకాదు అలీ వంటి కమెడియన్ ను పెట్టి ‘యమలీల’ అనే చిత్రం చేసి బ్లాక్ బస్టర్ అందించాడు.

అలాంటి దర్శకుడు అదే ఏడాది ‘భైరవద్వీపం’ ‘బొబ్బిలి సింహం’ వంటి హిట్లు కొట్టిన బాలకృష్ణతో సినిమా చేస్తున్నాడు అంటే ఎన్ని అంచనాలు నెలకొంటాయి అనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలా భారీ అంచనాల నడుమ రూపొందిన చిత్రమే ‘టాప్ హీరో’. ఎస్వీ.కృష్ణారెడ్డి దర్శకుడు బాలకృష్ణ హీరో, సౌందర్య హీరోయిన్.. ఇంకేం కావాలి అభిమానులకి.. సినిమా బ్లాక్ బస్టర్ పక్కా అని ఫిక్స్ అయిపోయారు. డిస్ట్రిబ్యూటర్లు ఎగబడి భారీ రేట్లకు హక్కులను కొనుగోలు చేశారు.

థియేట్రికల్ బిజినెస్ అనుకున్నదానికంటే రెండింతలు ఎక్కువ జరిగింది. నిర్మాత ఆచంట గోపినాథ్ కు టేబుల్ ప్రాఫిట్స్ దక్కాయి. కానీ 1994వ సంవత్సరం డిసెంబర్ 9న విడుదలైన ‘టాప్ హీరో’ చిత్రం ప్లాప్ అయ్యింది. బయ్యర్స్ చాలా వరకు నష్టపోయారు. ఎస్వీ.కృష్ణారెడ్డి స్టార్ హీరోలను హ్యాండిల్ చేయలేడు అనే విమర్శలను ఎదుర్కొన్నాడు. అయితే ‘టాప్ హీరో’ ని బుల్లితెర ప్రేక్షకులు ఆదరించారు. ఇక్కడ మాత్రం ఈ చిత్రం బాగానే పెర్ఫార్మ్ చేసింది.నేటితో ఈ చిత్రం విడుదలై 27 ఏళ్ళు పూర్తికావస్తోంది.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus