బుల్లితెరపై మహారాణిగా వెలుగొందుతోన్న యాంకర్ సుమ.. నటుడు రాజీవ్ కనకాలను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికీ పెళ్లి జరిగి రెండు దశాబ్దాలు దాటేసింది. ఇదిలా ఉండగా.. సుమ అప్పుడప్పుడు తన ప్రేమ, పెళ్లి వంటి విషయాలపై స్పందిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో తను రాజీవ్ కి బ్రేకప్ చెప్పిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. రాజీవ్ మొదటిసారి ఓ స్టూడియోలో సుమను చూశారు. మొదటిచూపులోనే ఆమె నచ్చడంతో.. పరిచయం పెంచుకొని తన ప్రేమ విషయాన్ని చెప్పాడు.
అలా 1994లో వీరి ప్రేమ కథ మొదలైంది. ఆ సమయంలో రాజీవ్ బుల్లితెర నటుడిగా కొనసాగుతుంటే.. సుమ వెండితెరపై హీరోయిన్ గా ఎదగాలనే ప్రయత్నాలలో ఉన్నారు. కొన్నాళ్ల తరువాత రాజీవ్ పెళ్లి ప్రపోజల్ పెట్టి.. ఓ కండీషన్ పెట్టారట. పెళ్లి తరువాత సినిమాలు మానేయాలని షరతులు పెట్టడంతో.. సుమ కోప్పడిందట. రాజీవ్ కి బ్రేకప్ చెప్పేసి.. దాదాపు ఏడాదిన్నర పాటు మాట్లాడలేదట. రాజీవ్ ఎంత ప్రయత్నించినా.. సుమ మాత్రం స్పందించేది కాదట.
కొన్నాళ్లకు సుమకి సినిమాలపై ఆసక్తి తగ్గడంతో.. మళ్లీ సుమ, రాజీవ్ దగ్గరయ్యారట. తమ ప్రేమ విషయాన్ని రాజీవ్ తండ్రి దేవదాస్ కనకాలకు చెప్పి పెళ్లికి ఒప్పించారట. ప్రస్తుతం వీరిద్దరికీ ఇద్దరు పిల్లలున్నారు. కొడుకు రోషన్ ని హీరోగా పరిచయం చేయడానికి సుమ-రాజీవ్ సన్నాహాలు చేస్తున్నారు.