అక్కినేని ఫ్యామిలీ చిత్రం “మనం”లో అఖిల్ ని విక్రమ్ కుమార్ సూపర్ గా చూపించారు. అతని దర్శకత్వంలో అఖిల్ హలో మూవీ చేస్తున్నారు. 40 కోట్ల బడ్జెట్ తో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లలో అక్కినేని నాగార్జున నిర్మించిన ఈ మూవీ ఈనెల 22 న రిలీజ్ కానుంది. ఆడియో వేడుకని వైజాక్ లో ఎల్లుండి నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ట్రైలర్ తో ఆకట్టుకున్న హలో మూవీలో అనేక ఆకర్షించే అంశాలున్నాయని తెలిసింది. మొదటగా స్టోరీ.. ఇది రెగ్యులర్ స్టోరీస్ కి భిన్నంగా.. ఉదయం 7 నుంచి సాయంత్రం 7.30వరకూ.. అంటే 12 గంటల్లో జరిగే కథే ఈ చిత్రం అంటున్నారు. అయితే.. ఆయా సన్నివేశాల్లో ఫ్లాష్ బ్యాక్స్ రూపంలో మిగిలిన కథను చూపిస్తారట. ఇక విక్రమ్ కె కుమార్ ఇప్పటివరకూ తీసిన చిత్రాలకు భిన్నంగా యాక్షన్ ఎపిసోడ్స్ కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారని సమాచారం.
హలో మూవీలో మూడు యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్ గా ఉంటాయట. మొదటగా ఔటర్ రింగ్ రోడ్డుపై తీసిన ఓ ఛేజింగ్ సీన్ సూపర్బ్ అని చిత్ర బృందం వెల్లడించింది. కార్లు.. వాటి మధ్య పరిగెత్తే మనుషులతో ఈ సీన్ సినిమా మొత్తానికి హైలైట్ గా నిలుస్తుందని తెలిపింది. మరొకటి.. కృష్ణా నగర్ లో బిల్డింగ్ ల పై నుంచి జంపింగ్స్ చేస్తూ సాగే మరో యాక్షన్ సీక్వెన్స్. జాకీచాన్ సినిమా టైపులో ఈ సన్నివేశానికి కామెడీ టచ్ కూడా అద్దారట. ఇక మూడోది .. హైదరాబాద్ మెట్రో రైల్ లో తీసిన సీక్వెన్స్. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ బాబ్ బ్రౌన్ నేపథ్యంలో ఈ సీక్వెన్స్ చిత్రీకరణ జరిగింది. ఈ ఒక్క యాక్షన్ సీక్వెన్స్ కోసం 12 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ యాక్షన్ సీన్స్ తో లవ్ స్టోరీ మిక్స్ చేయడం విభిన్నంగా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.