Janhvi Kapoor: బాయ్ ఫ్రెండ్ సీక్రెట్స్ చెప్పేసిన జాన్వీ కపూర్.. అందుకే బ్రేకప్ అయిందట!

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తెలుగులో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్నారు. జాన్వీ కపూర్ దేవ (Devara) ర సినిమాలో తంగం అనే పాత్రలో నటిస్తుండగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. మరోవైపు (Ram-Charan) రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాలో సైతం జాన్వీ కపూర్ ఛాన్స్ కొట్టేసిందని అధికారికంగా క్లారిటీ వచ్చేసింది. ఒక ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన పేరుకు సంబంధించిన సీక్రెట్లను వెల్లడించడంతో పాటు బాయ్ ఫ్రెండ్ గురించి సైతం జాన్వీ కపూర్ రివీల్ చేశారు.

తల్లి శ్రీదేవి (Sridevi) నన్ను డాక్టర్ ను చేయాలని అనుకుందని నేను మాత్రం యాక్టర్ అయ్యానని డాక్టర్ అయ్యేంత టాలెంట్ నాలో లేదేమో అనిపిస్తుందని ఆమె పేర్కొన్నారు. డ్యాన్స్, కవిత్వం అంటే ఇష్టమని అప్పుడప్పుడూ కవితలు రాస్తానని జాన్వీ కపూర్ కామెంట్లు చేశారు. తనతో ఉండే రెడ్ కలర్ వాటర్ బాటిల్ అంటే ఎంతో ఇష్టమని ఆమె చెప్పుకొచ్చారు. ఆ బాటిల్ కు చుస్కీ అనే పేరు పెట్టానని జాన్వీ కపూర్ పేర్కొన్నారు.

జుదాయి సినిమాలోని జాన్వీ పాత్ర అంటే తల్లీదండ్రులకు ఇష్టమని ఆ పాత్ర పేరును నా పేరుగా పెట్టారని ఆమె కామెంట్లు చేశారు. నాన్నకు అబద్ధం చెప్పి నేను లాగ్ వేగాస్ కు వెళ్లానని జాన్వీ కపూర్ వెల్లడించారు. తిరుపతిలో నా పెళ్లి జరుగుతుందని పెళ్లిలో కాంచీపురం ఝరీ కట్టుకుంటానని ఆమె పేర్కొన్నారు. ఫోటో మార్ఫింగ్ వల్ల నేను నా ఫ్రెండ్స్ కు దూరం కావాల్సి వచ్చిందని జాన్వీ కపూర్ కామెంట్లు చేశారు.

ఒక అబద్ధం వల్ల బాయ్ ఫ్రెండ్ తో నా రిలేషన్ ముగిసిందని ఆమె తెలిపారు. నా తల్లీదండ్రులు సైతం బాయ్ ఫ్రెండ్ ఉండకూడదని చెప్పారని జాన్వీ అన్నారు. జాన్వీ కపూర్ వెల్లడించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. జాన్వీని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

ఇంటర్వ్యూ : ‘గామి’గురించి డైరెక్టర్ విద్యాధర్ కాగిత చెప్పిన ఆసక్తికర విషయాలు.!

ఇంటర్వ్యూ : ‘భీమా’ గురించి గోపీచంద్ చెప్పిన ఆసక్తికర విషయాలు
రోడ్డుపై యాంకర్ ఝాన్సీ చెత్త సేకరించడానికి కారణాలివేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus