‘ఆ రోజు నేను కచ్చితంగా ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుంటాను’ అంటూ కొన్ని నెలల క్రితం బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమిర్ ఖాన్ చెప్పిన డేట్ వచ్చేసింది. అన్నట్టుగానే ఆయన ఎమోషనల్ అయ్యారు కూడా. దేని గురించి మీకు గుర్తుండే ఉంటుంది. ఆయన తొలి సంతానం ఐరా ఖాన్ వివాహం జరిగింది. తను మనసిచ్చిన ప్రియుడు నుపుర్ శిఖరేను పెళ్లి చేసుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ అగ్ర కథానాయకుడు ఆమిర్ ఖాన్, నిర్మాత రీనా దత్తా కుమార్తె ఐరా ఖాన్ గత కొన్నేళ్లుగా ఫిట్‌నెస్ ట్రైనర్ నుపుర్ శిఖరేతో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని కొన్ని నెలల క్రితం ప్రకటించిన ఐరా… ఇటీవల పెళ్లి తేదీని కూడా ప్రకటించింది. అలా ముంబయిలోని ఓ హోటల్ వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది. రిజిస్టర్ మ్యారేజీతో ఐరా – నుపుర్ ఒక్కటయ్యారు. బంధువులు, స్నేహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది.
ఐరా – నుపుర్ వివాహానికి ఆమిర్ ఖాన్, తన మాజీ భార్యలు రీనా దత్తా, కిరణ్ రావు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ – నీతా అంబానీ దంపతులు హాజరయ్యారు. వాళ్లతోపాటు ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు కూడా ఈ వేడుకకు విచ్చేశారు. పెళ్లి తర్వాత అదే హోటల్‌లో రిసెప్షన్ కూడా జరిగింది. ఆ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
‘మెంటల్ హెల్త్ సపోర్ట్ ఆర్గనైజేషన్’ సంస్థ వ్యవస్థాపకురాలు, సీఈవో అయిన (Ira Khan) ఐరా.. తరచూ మానసిక ఆరోగ్యంపై సోషల్ మీడియాలో అవగాహనా పోస్టులు పెడుతుంటుంది. అంతకుమందు నుండే ఆమిర్ ఖాన్‌కు నుపుర్ వ్యక్తిగత ఫిట్‌నెస్ ట్రైనర్‌గా ఉన్నారు. ఆ సమయంలో ఐరా కూడా నుపుర్ వద్ద ఫిట్‌నెస్ పాఠాలు నేర్చుకుంది. కరోనా – లాక్‌డౌన్ సమయంలో వీరి స్నేహం ప్రేమగా మారింది అని సమాచారం.
ఇక ఈ వేడుకకు విచ్చేసిన మాజీ భార్య కిరణ్ రావ్‌కు ఆమిర్ ఆత్మీయంగా హగ్ ఇచ్చి, కిస్ చేయడం వైరల్ మారింది. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే… ఐరాతో వివాహనికి నుపుర్ తన నివాసం నుండి జాగింగ్ చేస్తూ హోటల్‌కు వచ్చాడు. ఆ దుస్తుల్లోనే వివాహం చేసుకున్నాడు. అయితే ఈ నెల 8న రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో మరోసారి వీరి వివాహం జరుగుతుందట. అలాగే జనవరి 13న ముంబయిలో సన్నిహితులు, సినిమా జనాల కోసం వివాహ విందు భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు.
ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!
ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!