Manchu Manoj: ‘అహం బ్రహ్మాస్మి’ సినిమా ఆగిపోయినట్లేనా..?

  • June 27, 2022 / 07:40 PM IST

టాలీవుడ్ లో హీరోగా కెరీర్ మొదలుపెట్టారు మంచు మనోజ్. మొదట్లో అన్ని విలక్షణ పాత్రలను ఎన్నుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తనకంటూ మార్కెట్ ను సృష్టించుకోగలిగారు. అయితే మెల్లగా అతడి జోరు తగ్గిపోయింది. సినిమాలు తగ్గించేశారు. పెర్సనల్ లైఫ్ లో కొన్ని ఛాలెంజెస్ ఎదుర్కోవాల్సి వచ్చింది. భార్యతో విడాకుల తరువాత అసలు మంచు మనోజ్ గురించి ఎలాంటి విషయాలు బయటకు రావడం లేదు. కొన్నాళ్లక్రితం ‘అహం బ్రహ్మాస్మి’ అనే సినిమాను అనౌన్స్ చేశారు మంచు మనోజ్.

కొన్నాళ్లపాటు హడావిడి చేసిన తరువాత మళ్లీ సైలెంట్ అయిపోయారు. మధ్యలో ఓసారి తెలంగాణలో టూరిజం ప్రాజెక్ట్ కోసం ప్రయత్నించారు. అలానే జగన్ ని కలిసి వచ్చారు. ప్రస్తుతం ఆయన తిరుపతిలో ఉంటున్నారని సమాచారం. ఇటీవల మళ్లీ ఆయన సన్నబడే ప్రయత్నం చేస్తున్నాడని.. ‘అహం బ్రహ్మాస్మి’ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాడని అన్నారు. మరో ప్రాజెక్ట్ కూడా సొంత బ్యానర్ పై చేయబోతున్నట్లు వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు ‘అహం బ్రహ్మాస్మి’ సినిమా క్యాన్సిల్ అయినట్లు టాక్.

ఈ సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి ప్రాజెక్ట్ నుంచి పక్కకు తప్పుకున్నాడట. ఇక ఆ ప్రాజెక్ట్ మీద పని చేయడం, దాని మీదే అలా ఉండడం తన వల్ల కాదని చెప్పేసినట్లు తెలుస్తోంది. అక్కడ నుంచి జంప్ చేసి మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో సినిమా మొదలుపెట్టేశారు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి చిన్న వీడియో కూడా వచ్చింది. ఆ వీడియోలో డైలాగ్స్ వింటుంటే ‘అహం బ్రహ్మాస్మి’ ప్రాజెక్ట్ నే ఇటు షిఫ్ట్ చేశాడా అనే సందేహాలు కలుగుతున్నాయి.

అదే జరిగితే ఇప్పట్లో మంచు మనోజ్ నుంచి మరో సినిమా రాదేమో అనిపిస్తుంది. రీఎంట్రీ అని చెప్పిన ప్రాజెక్టే పోయిందంటే మరో ప్రాజెక్ట్ సెట్ చేసుకోవడానికి ఇంకెంత సమయం తీసుకుంటారో!

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus