Akira Nandan: ‘ఓజీ’లో అకీరా ఉండటం కన్ఫార్మ్.. అయితే ఎలా ఉంటాడు అనేదే విషయం!

‘ఓజీ’ (OG Movie) సినిమాలో అకీరా నందన్‌ నటిస్తున్నాడు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇదిగో ఈ సీన్‌లో కనిపిస్తున్నది అకీరానే అంటూ ఆ మధ్య ఓ వీడియో క్లిప్‌ను కూడా వైరల్‌ చేశారు. అయితే అది వేరే సినిమాలోని క్లిప్‌ అని, అకీరా నటించడం లేదు అని టీమ్‌ ఇన్‌డైరెక్ట్‌గా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. అయినా ఆ పుకార్లు ఆగడం లేదు. తాజాగా, ప్రముఖ సంగీత దర్శకుడు తమన్‌ (S.S.Thaman)  మాటలు వింటుంటే ‘ఓజీ’ సినిమాలో అకీరా భాగమయ్యాడు అని అర్థమవుతోంది.

Akira Nandan

అయితే కొంతమంది మాత్రం ఇంకా లేదని, భాగమవుతాడు అని అంటున్నారు. దానికి కారణం అవసరమైతే ‘ఓజీ’ సినిమా కోసం అకీరాను టీమ్‌లో భాగం చేసుకుంటాను అని తమన్‌ అనడమే. అంటే ఆ ఆలోచన బలంగా ఆయనలో ఉంది అని అంటున్నారు. అయితే, సంగీత దర్శకుడు అలా అనడం ఏంటి అనే డౌట్‌ రావొచ్చు. అకీరాకు పియానో ప్లే చేయడం బాగా వచ్చు అనే విషయం మీకు తెలిసిందే. సినిమా సంగీతంలో పియానో అవసరం పడితే తీసుకుంటా అని తమన్‌ అర్థం.

ఆ లెక్కన అయినా ‘ఓజీ’లో అకీరా (Akira Nandan) భాగమవుతాడు. అకీరా చేతి వేళ్లు పెద్దగా ఉంటాయని, పియానో అద్భుతంగా ప్లే చేస్తాడని తమన్‌ చెప్పాడు. అక్కడి వరకు ఓకే.. కానీ రెండు నెలలు అకీరాతో కలిసి పని చేసిన అనుభవంతో ‘ఓజి’ కోసం పిలిపించుకుంటానని తమన్‌ అన్నాడు. అయితే అకీరా రెండు నెలలు తమన్‌తో ఏ సినిమా కోసం కలసి పని చేశాడు అనేదే ఇప్పుడు ప్రశ్న.

తమన్‌ రీసెంట్‌గా చేసిన సినిమాల్లో పని చేశాడా? లేక ‘ఓజీ’ కోసం అకీరా ఇప్పటికే పని చేశాడా అనేది తెలియడం లేదు. ఇక అకీరాను రెండు, మూడేళ్లలో వారసుడిగా తీసుకురావడానికి పవన్‌ (Pawan Kalyan) ప్లాన్‌ చేస్తున్నాడట. రాజకీయాల్లో బిజీ అయిపోయిన నేపథ్యంలో తనయుణ్నినటుడిగా తీసుకొచ్చే ప్లాన్స్‌ ఉన్నాయట. ఇప్పటికే వైజాగ్‌ సత్యానంద్‌ దగ్గర అకీరా శిక్షణ తీసుకుంటున్నాడని టాక్‌.

ఈ క్రేజ్ తో.. షారుఖ్ రికార్డులను పుష్ప రాజ్ బ్లాస్ట్ చేయగలడా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus