ఇప్పట్లో అనుష్క కనబడే సూచన లేనట్టేనా?

Advertisement

‘అరుంథతి’ చిత్రంతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది అనుష్క. తెలుగులో మాత్రమే కాదు తమిళంలో కూడా ఈమె స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ‘బాహుబలి’ తో అయితే పాన్ ఇండియా రేంజ్లో ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఈమె ఓకే అనాలే కానీ.. నయన తార కంటే ఎక్కువ పారితోషికం ఇచ్చి తమ సినిమాల్లో ఎంపిక చేసుకోవడానికి దర్శక నిర్మాతలు రెడీగా ఉన్నారు. అయితే అనుష్క మాత్రం వరుస సినిమాలు చెయ్యడానికి ఓకే చెప్పడం లేదు.

ఇప్పుడు ‘అనుష్క కూడా ప్రభాస్ లానే తయారయ్యింది’ అనే కామెంట్స్ కూడా ఎక్కువయ్యాయి. ‘బాహుబలి2’ తరువాత ప్రభాస్ నుండీ వచ్చిన చిత్రం ఒక్క ‘సాహో’ మాత్రమే..! ఇక అనుష్క కూడా అంతే..! ‘బాహుబలి2’ తరువాత అనుష్క నటించిన చిత్రం ఒక్క ‘భాగమతి’ మాత్రమే..! తరువాత మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో కాసేపు ఝాన్సీ లక్ష్మీ బాయ్ పాత్రలో కనిపించింది. ఇక ‘నిశ్శబ్దం’ చిత్రం చేసినా.. అది ఇంకా విడుదల కాలేదు. సమ్మర్ కు విడుదల చెయ్యాలి అని దర్శకనిర్మాతలు ప్లాన్ చేశారు కానీ..

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ వల్ల అది రిలీజ్ కాలేదు. ఓటిటిలో విడుదల చెయ్యడానికి నిర్మాతలు మాత్రం ముందుకు రావడం లేదు. ఇదిలా ఉండగా.. అనుష్క ‘నిశ్శబ్దం’ తరువాత ఏ డైరెక్టర్ తో వర్క్ చేసేదీ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ‘రారా కృష్ణయ్య’ దర్శకుడు మహేష్ తో అనుష్క ఓ చిత్రం చేయబోతుంది అంటూ కొన్నాళ్ల పాటు ప్రచారం జరిగింది కానీ.. అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

Most Recommended Video

‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ హీరోయిన్ రూప గురించి మనకు తెలియని విషయాలు..!
పోకిరి మూవీలో పూరిజగన్నాథ్ సోనూసూద్ నీ హీరోగా అనుకున్నాడట!
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news