పోకిరి మూవీలో పూరిజగన్నాథ్ సోనూసూద్ నీ హీరోగా అనుకున్నాడట!

  • April 28, 2022 / 09:54 AM IST

2020లో ప్రతిరోజు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే పదాలు ఒకటి కరోనా రెండు సోనూ సూద్. సోషల్ మీడియాలో సోనూ సూద్ పై చర్చ జరగని రోజు లేదు. అడిగిందే తడవుగా ఆయన పేదలను ఆదుకుంటున్న తీరు సోనూ సూద్ ని దేవుడిని చేసింది. లాక్ డౌన్ సమయంలో వందల కిలోమీటర్లు రోడ్లు పట్టుకొని నడుచుకుంటూ సొంత ఇళ్లకు పయనమైన పేదలను వారి సొంత ఊర్లకు పంపడంతో మొదలైన ఆయన సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎవరు ఎలాంటి ఆపదలో ఉన్నా, సోను సూద్ స్పందిస్తున్న తీరు ఆయన్ని ఓ గొప్ప మానవతావాదిగా నిలబెట్టింది. మరి ఇంత మంచి వ్యక్తి గుర్తించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం…

1. వెండితెర ఎంట్రీ

సోనూ సూద్ 1999లో వచ్చిన కల్లాజగార్ అనే తమిళ చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యారు. విజయ్ కాంత్ హీరోగా వచ్చిన ఆ సినిమాలో సోనూ సూద్ విలన్ గా చేయడం జరిగింది. ఆ పాత్ర కోసం సోనూ సూద్ గుండు చేయించుకోవడం విశేషం.

2. ఫస్ట్ తెలుగు మూవీ

నాగబాబు,జయసుధ ప్రధాన పాత్రలో తెరకెక్కిన హాండ్స్ అప్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు సోనూసూద్. ఆ సినిమాలో విలన్ రోల్ చేసిన సోనూ మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ పంచుకున్నారు.

3. ఆ రెండు చిత్రాలు చాలా కీలకం

సోనూ సూద్ కెరీర్ ని మలుపు తిప్పిన సంవత్సరంగా 2005ని చెప్పుకోవాలి. ఆ ఏడాది ఆయన నటించిన రెండు చిత్రాలు మంచి బ్రేక్ ఇచ్చాయి. ఒకటి పూరి తెరకెక్కించిన సూపర్ కాగా రెండు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అతడు. ఆ రెండు చిత్రాలలో సోనూ హీరోలకు సమానమైన పాత్రలు చేశారు.

4. అరుంధతిలో పశుపతిగా భయపెట్టాడు

ఇక అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన అరుంధతి మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో మనకు తెలిసిందే. ఆ మూవీలో విలన్ పశుపతి పాత్రలో సోనూ నటన ఎవ్వరూ మరచిపోరు. ఆ సినిమా విజయానికి సోనూ సూద్ నటన కూడా ఒక కారణం. సోనూ సూద్ చెప్పిన నిన్ను వదల బొమ్మాళి ఆమె డైలాగ్ ఇప్పటికీ ఫేమస్సే.

5. హాలీవుడ్ లో కూడా నటించారు

దేశంలోని అన్ని ప్రధాన భాషలలో నటించిన సోనూ సూద్ హాలీవుడ్ మూవీలో కూడా నటించారు. లెజెండరీ నటుడు జాకీ చాన్ తో కలిసి ఆయన జువాన్జాంగ్ అనే చిత్రంలో నటించారు.

6.వాటికి ఎప్పుడూ దూరమే

ఆరోగ్యం, ఫిట్నెస్ పై ఎంతో శ్రద్ద చూపించే సోనూ సూద్ కఠిన నియమాలు పాటిస్తారు. కేవలం శాకాహారం తీసుకుంటారు. ధూమపానం మరియు మద్యపానం చేయరు.

7. నిర్మాత కూడా


తన తండ్రి జ్ఞాపకార్ధం సోనూ సూద్ ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించారు. శక్తి సాగర్ ప్రొడక్షన్స్ పేరుతో స్థాపించిన ఈ బ్యానర్ లో ఇప్పటి వరకు కుంగ్ ఫు యోగా మరియు తుటక్ తుటక్ టుటియా అనే చిత్రాలు నిర్మించారు.

8. సింధు బయోపిక్

సోనూ సూద్ తన సొంత నిర్మాణ సంస్థ శక్తి సాగర్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో బ్యాట్మింటన్ సంచలనం పి వి సింధు బయోపిక్ తెరకెక్కించనున్నారు. 2017లోనే ఈ హక్కులు దక్కించుకున్న సోనూ సూద్ వచ్చే ఏడాది నిర్మాణం మొదలుపెట్టనున్నాడు.

9. జూహు హోటల్ మెడికల్ సిబ్బంది కోసం

ముంబైలోని జూహు ఏరియాలో గల అత్యంత ఖరీదైన హోటల్ ని కరోనా రోగులకు సేవ చేస్తున్న మెడికల్ సిబ్బంది సౌకర్యార్ధం వినియోగించుకోవడానికి సోనూ సూద్ అనుమతి ఇవ్వడం జరిగింది.

10. పోకిరిలో హీరోగా చేయాల్సింది.

ఇక మహేష్ కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ గా ఉన్న పోకిరి మూవీని సోనూ సూద్ హీరోగా చేయాలని పూరి అనుకున్నారట. కారణం ఏదైనా అది కార్యరూపం దాల్చలేదు. మరి అదే జరిగితే సోనూ సూద్ స్టార్ హీరో అయ్యేవారేమో.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus