‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ హీరోయిన్ రూప గురించి మనకు తెలియని విషయాలు..!

ట్యాలెంటెడ్ హీరో సత్యదేవ్ నటించిన ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రం తాజాగా ఓటిటిలో విడుదలయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ‘కేరాఫ్ కంచెరపాలెం’ చిత్రాన్ని తెరకెక్కించిన వెంకటేష్ మహా ఈ చిత్రానికి దర్శకుడు.‘మ‌హేశింతే ప్రతీకార‌మ్‌’ అనే మలయాళం సినిమాకి ఇది రీమేక్. అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఎంతో సహజంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు ఈ యంగ్ డైరెక్టర్. ఇక ఈ సినిమాలో అందరి పాత్రలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అయితే జ్యోతి పాత్ర చేసిన హీరోయిన్ గురించి మాత్రం మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

మేకప్ లేకుండా ఎంతో నేచురల్ గా కనిపించింది ఈ బ్యూటీ. కొంతమంది ప్రేక్షకులకు క్రష్ గా కూడా మారిపోయిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈమె గురించి ఇప్పుడు గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు. అలాంటివారి కోసం ఈ హీరోయిన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని తెలియజేస్తున్నాం:

నిజ జీవితంలో కూడా ఈమె పేరు రూప కొడువయుర్ నే.! ఈమె ఒక డాక్టర్. అలా అని డాక్టర్ అవ్వాలని.. కుదరక యాక్టర్ అవ్వలేదు. ఈ అమ్మడికి డాక్టర్ అవ్వాలనేది యాంబిషన్. ఇక చిన్నప్పటి నుండీ డ్యాన్స్ లు.. ఫైన్ ఆర్ట్స్ వంటివి కూడా చాలా ఇంట్రెస్ట్.

2020 లో ఈమె ‘ఎం.బి.బి.ఎస్’ పూర్తి చేసింది. ఆ తరువాత డాక్టర్ గా ప్రాక్టీస్ మొదలుపెట్టింది కూడా..! మరోపక్క భరతనాట్యం, కూచిపూడి ప్రదర్శనలు కూడా ఇచ్చేది.

దర్శకుడు వెంకటేష్ మహా.. ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రంలో హీరోయిన్ కోసం ఆడిషన్ నిర్వహించాడు. ఈ విషయాన్ని రూప.. తన ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకుని ఆడిషన్ కు హాజరయ్యింది. అందులో భాగంగా ఈమె చేసిన డ్యాన్స్ కు.. దర్శకుడు వెంకటేష్ మహా అలాగే నిర్మాత ప్రవీణ్.. ఫిదా అయిపోయి వెంటనే సినిమాలో ఛాన్స్ ఇచ్చేసారట. సినిమాలో ఈమె ఎంత బాగా డ్యాన్స్ చేసిందో చూసారుగా..!

అలా ఈ చిత్రంలో ఛాన్స్ దక్కించుకున్న రూపకు.. నిజజీవితంలో మేకప్ లేకుండా ఉండడం అంటేనే ఇష్టమట. సినిమాలో కూడా అలానే ఉండాలని డైరెక్టర్ చెప్పడంతో ఈమె మరింత ఇష్టంతో ఈ పాత్ర చేసినట్టు తెలుస్తుంది. డ్యాన్స్ లో ఈమె సిద్దహస్తురాలు.. అలాగే మేకప్ లేకుండా ఉండడం కూడా ఈమెకు చాలా ఇష్టం.ఈమెకు ఇష్టమైన రెండూ కూడా ఈమెకు బాగా కలిసొచ్చాయని స్పష్టమవుతుంది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus