అనుష్క (Anushka Shetty), దర్శకుడు క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) కాంబినేషన్లో ‘వేదం’ (Vedam) వంటి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత ‘ఘాటి’ (Ghaati) అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. దాదాపు 14 ఏళ్ళ వీరి కాంబోలో రాబోతున్న సినిమా ఇది. ఈ మధ్యనే అంటే అనుష్క పుట్టినరోజు సందర్భంగా ఒక చిన్న గ్లింప్స్ ని వదిలారు. అందులో అనుష్క చాలా మాస్ గా కనిపించి అందరికీ షాకిచ్చింది. ఈ సినిమాలో ఓ గిరిజన యువతిగా కనిపించబోతున్న అనుష్క.. ఓ బస్సులోకి వెళ్లి.. ఓ విలన్ తలని కత్తితో కసితీరా కోసేసి..
తర్వాత దాన్ని చేత్తో తీసుకుని రావడం అనేది అందరినీ ఒకింత భయపెట్టింది అని చెప్పాలి. గంజాయి బ్యాక్ డ్రాప్లో.. ఓ రివేంజ్ డ్రామాగా ఈ సినిమా తెరక్కుతున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. ఘాటి సినిమా షూటింగ్ అప్పుడే కంప్లీట్ అయిపోయిందట. జూన్ లో ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ అయ్యింది. రామోజీ ఫిలింసిటీలో ఒక సెట్టు వేసి చాలా వరకు షూటింగ్ ను అక్కడ కంప్లీట్ చేసేశారట.
అనుష్క పార్ట్ అయితే రెండు నెలల క్రితమే కంప్లీట్ అయిపోయింది అని వినికిడి. ఇటీవల జరిగిన షెడ్యూల్ తో.. షూటింగ్ మొత్తం కంప్లీట్ అయినట్లు తెలుస్తుంది. కొంత గ్యాప్ తర్వాత ప్యాచ్ వర్క్..లు, అలాగే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్..లు మొదలు పెడతారు అని సమాచారం. దర్శకుడు క్రిష్.. సినిమాలని ఫాస్ట్ గా తెరకెక్కించడంలో సిద్ధహస్తుడు అని అందరికీ తెలుసు.
కానీ పాన్ ఇండియా సినిమాని కూడా ఇంత ఫాస్ట్ గా తీయగలడా? అని ‘ఘాటి’ కంప్లీట్ చేసి అంతా ఆశ్చర్యపోయేలా చేశాడు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం సమ్మర్ కానుకగా విడుదల కాబోతోందని టాక్ నడుస్తుంది.’యూవీ క్రియేషన్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.