Naga Chaitanya, Sobhita: చైతన్య – శోభిత పెళ్లి పనులు షురూ.. ఫొటోలు వైరల్‌.. ఏం జరిగిందంటే?

ప్రముఖ కథానాయకుడు నాగ చైతన్య (Naga Chaitanya) – కథానాయిక శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) పెళ్లి పనులు ఘనంగా మొదలయ్యాయి. మరికొన్ని రోజుల్లో ఇద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ క్రమంలో ఈ జంటకు ఇటీవల హల్దీ వేడుక జరిగింది. కాబోయే వధూవరులకు శాస్త్రోక్తంగా ఈ వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో కుటుంబసభ్యులతోపాటు అత్యంత సన్నిహితులు పాల్గొన్నారు.

Naga Chaitanya

మంగళస్నానాలు చేయించడంతో మొదలైన తంతు.. హల్దీ రాయడంతో ముగిసింది. ఈ క్రమంలో ఆ ప్రాంతం మొత్తం నవ్వులు, ఆనందంతో నిండిపోయింది. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. డిసెంబర్‌ 4న చైతన్య (Naga Chaitanya) – శోభిత(Sobhita Dhulipala) వివాహం అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరగనున్న విషయం తెలిసిందే.

ఈ కార్యక్రమానికి కూడా అందరినీ పిలవడం లేదని.. బాగా సన్నిహితులను మాత్రమే ఆహ్వానిస్తున్నారని తెలిసింది. ఇక శోభిత (Sobhita Dhulipala) తో జీవితాన్ని పంచుకునేందుకు తాను ఎదురుచూస్తున్నానని ఇటీవల నాగ చైతన్య(Naga Chaitanya) చెప్పాడు. మా పెళ్లి సింపుల్‌గా, సంప్రదాయబద్ధంగా జరగనుంది. ఎలాంటి ఆర్భాటాలకు పోవడం లేదు. ఆహ్వానితుల లిస్ట్‌, పెళ్లి పనులకు సంబంధించిన విషయాలను ఇద్దరం కలిసి నిర్ణయిస్తున్నామని చెప్పాడు చైతు.

అన్నపూర్ణ స్టూడియోస్‌ తమ కుటుంబానికి ఎంతో ప్రత్యేకమని, స్టూడియోలోని తాతగారి విగ్రహం ఎదురుగా మా పెళ్లి జరగనుందని చైతు (Naga Chaitanya) ఇప్పటికే చెప్పాడు. తాతగారి ఆశీస్సులు ఎప్పుడూ మాపై ఉండాలనే ఉద్దేశంతోనే ఇరు కుటుంబాలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నాయని కూడా చెప్పాడు. శోభిత.. తాను బాగా కనెక్ట్‌ అయ్యామని, తనను ఆమె బాగా అర్థం చేసుకుందని చెప్పాడు.

ఇక తన జీవితంలో వివిధ కారణాల వల్ల ఏర్పడిన శూన్యాన్ని శోభిత పూడుస్తుందని నమ్ముతున్నానని చైతు (Naga Chaitanya) అన్నాడు. మరోవైపు ఆమె కూడా చైతుతో పెళ్లి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అని చెప్పింది. ఓవైపు చైతన్య (Naga Chaitanya) పెళ్లి, మరోవైపు అఖిల్‌ ఎంగేజ్‌మెంట్‌ దగ్గరదగ్గరగా అవ్వడంతో అక్కినేని కుటుంబంలో ఆనందాలు వెల్లివిరిస్తున్నాయి. ఇక పెళ్లిలో కూడా ఇలానే ఉంటుంది అని చెప్పొచ్చు.

సైలెంట్ గా పెళ్లి చేసుకున్న సుబ్బరాజు.. వైరల్ అవుతున్న పెళ్లి ఫోటోలు!

1

2

3

4

5

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus