స్పైడర్ రిలీజ్ డేట్ లో మార్పులు ఉంటాయా?

  • April 13, 2017 / 11:35 AM IST

చాలారోజుల పాటు ఊరించిన మహేష్ బాబు కొత్త సినిమా ఫస్ట్ లుక్ నిన్న రిలీజ్ అయింది. టైటిల్ పై వచ్చిన రూమర్స్ అన్నీ నిన్నటితో తుడిచి పెట్టుకొని పోయాయి. స్పైడర్ గా మహేష్ బాబు లుక్ క్లాస్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ పోస్టర్ జనవరి ఫస్ట్ నే రిలీజ్ అవుతుందని అభిమానులు అనుకున్నారు. ఆ తర్వాత సంక్రాంతి, రిపబ్లిక్ డే, శివరాత్రి ఇలా పండుగలకు ఎదురుచూసారు. మహేష్ చెప్పినట్లుగా ఉగాదికి తప్పకుండా వస్తుందని నమ్మారు. కానీ అప్పుడూ రాలేదు. తీరా ఏ పండుగ, సందర్భం లేని నిన్న రిలీజ్ చేశారు.

ఫస్ట్ లుక్ విషయంలోనే మూడు నెలలపాటు పోస్ట్ ఫోన్ చేసిన డైరక్టర్.. సినిమా రిలీజ్ విషయంలో ఎన్ని సార్లు వాయిదా వేస్తారోనని టాలీవుడ్ వర్గాల వారు చర్చింకుంటున్నారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. మురుగదాస్ రెండు నెలల క్రితమే మహేష్ బాబు సినిమా జూన్ 23 న వస్తుందని ట్విట్టర్లో ప్రకటించారు. ఆ తేదీల్లో మార్పు ఉంటుందా? లేకుంటే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాలేదని వాయిదా వేస్తారా? అని అభిమానుల్లో సందేహం మొదలయింది. మరి ఇందుకు మహేష్ బృందం ఏమని సమాధానం చెబుతుందో చూడాలి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus