Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

‘ధురంధర్‌’ సినిమా ఇంకా రాక ముందు రోజులవి. ఇంకా చెప్పాలంటే ‘యురి’ సినిమా తర్వాతి రోజులు. మన టాలీవుడ్‌ హీరోలు ముంబయికి వెళ్లి మేం కూడా ఇక్కడ సినిమాలు చేస్తాం అంటూ చిన్నగా హింట్స్‌ ఇస్తున్న రోజులు. అలాంటి సమయంలో వినిపించిన ఓ రూమర్‌.. ఇద్దరు తెలుగు హీరోలతో దర్శకుడు ఆదిత్య ధర్‌ ఓ సినిమా చేయడనికి ప్లాన్స్‌ జరుగుతున్నాయి అని. ఆయన ఇటువైపు సంప్రదించారో, లేక ఇటువైపు హీరోలు అటువైపు అడిగారో కానీ ఓ ప్రాజెక్ట్‌ గురించి అయితే చర్చ జరిగింది.

Aditya Dhar

ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. అప్పుడెప్పుడో రూమర్లకే పరిమితమైన ఆ ప్రాజెక్ట్‌ ఇప్పుడు కచ్చితంగా పట్టాలెక్కుతుంది అని అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. మరీ ఇప్పుడే అంటే ఇప్పుడే కాదు కానీ.. మరికొన్ని నెలలో ఆ మల్టీస్టారర్‌ సినిమా అనౌన్స్‌మెంట్‌ రావొచ్చు అని చెబుతున్నారు. ‘ధురంధర్‌’ సినిమాలు సాధించిన విజయాల తర్వాత అప్పట్లో డౌట్‌ఫుల్‌గా ఉన్న వారంతా ఇప్పుడు కచ్చితంగా ఈ కాంబినేషన్‌లో సినిమా చేయాల్సిందే అని అనుకుంటున్నారట.

మొన్నేగా ‘ధురంధర్‌ 2’ సినిమా వచ్చింది అప్పుడే ఇన్నేసి మాటలు అనుకుంటున్నారా అనుకోవద్దు. ఎందుకంటే ఈ సినిమా రావడానికి మూడు నెలల ముందే రెండో పార్టు విజయం పక్కా అని అందరూ ఫిక్స్‌ అయిపోయారు. ఇదంతా ఓకే కానీ ఎవరూ నటులు ఆదిత్య ధర్‌తో సినిమా చేయాలనుకుంటున్నది అనుకుంటున్నారా? ఇంకెవరు టాలీవుడ్‌లో బావా బావా అని ఎక్కువగా పిలుచుకునే, పుట్టిన రోజుల సమయంలో సోషల్‌ మీడియాలో ‘బావా కోడ్‌’ వాడే అల్లు అర్జున్‌ – ఎన్టీఆర్‌.

చాలా ఏళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్‌ చర్చలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎలాగైనా ఈ సినిమా ఓకే చేసే పనిలో ఉన్నారట ఇద్దరు హీరోల ముంబయి టీమ్‌. మరోవైపు ఈ ప్రాజెక్టులో ఎవరైనా హీరో డౌట్‌ అంటే రామ్‌చరణ్‌ కూడా వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. చూద్దాం ఏమవుతుందో.. ఈ సినిమా ఎప్పుడవుతుందో?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags