Krithi Shetty: బేబమ్మ రాంగ్ రూట్ లో వెళుతోందా..?

  • May 18, 2021 / 09:51 PM IST

అందం, అభినయం పుష్కలంగా ఉన్న హీరోయిన్లకు అదృష్టం కూడా తోడైతే నటించిన సినిమాలు సక్సెస్ అవుతాయి. అలా అదృష్టం కూడా కలిసిరావడంతో కృతిశెట్టి నటించిన తొలి సినిమా ఉప్పెన బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. స్టార్ హీరోయిన్ కు కావాల్సిన లక్షణాలు కృతిశెట్టిలో పుష్కలంగా ఉండటంతో కొత్త సినిమా ఆఫర్లు కూడా బాగానే వచ్చాయి. అయితే ప్రస్తుతం కృతిశెట్టి డిమాండ్లు మాత్రం మామూలుగా లేవని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

రెమ్యునరేషన్ విషయంలో మొండిగా వ్యవహరించడంతో పాటు పాత్రకు ప్రాధాన్యత ఉండాలని కృతిశెట్టి పట్టుబడుతోందని సమాచారం. అయితే బేబమ్మ డిమాండ్లు తెలిసిన నిర్మాతలు కృతిశెట్టి రాంగ్ రూట్ లో వెళుతున్నారని కామెంట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలని ప్రయత్నిస్తే ఫ్లాప్ వచ్చినప్పుడు ఇబ్బందులు పడక తప్పదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి డిమాండ్ల వల్ల స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్లు వచ్చే అవకాశాలు సైతం తగ్గుతాయి. సినిమా ఇండస్ట్రీలో ఎంత ఎదిగినా ఒదిగి ఉంటే మాత్రమే కొత్త ఆఫర్లను అందిపుచ్చుకోవడం సాధ్యమవుతోంది.

బేబమ్మ తీసుకుంటున్న నిర్ణయాలు ఆమె కెరీర్ కు మంచి చేస్తాయో చెడు చేస్తాయో చూడాల్సి ఉంది. మరోవైపు కృతిశెట్టికి బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా కొత్త సినిమా ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ ఆఫర్ల విషయంలో కృతిశెట్టి ఏ విధంగా ముందుకెళతారో చూడాల్సి ఉంది. కృతిశెట్టి ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్ సినిమాతో పాటు సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఒక సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus