Lokesh, Anirudh: స్టార్‌ ‘డైరక్టర్’లను హీరోలను చేయాలనుకుంటున్నారా? నిజమేనా?

  • July 25, 2023 / 08:21 PM IST

దర్శకులు, సంగీత దర్శకులు హీరోలుగా మారడం కొత్తేమీ కాదు. గతంలో కొంతమంది ఇలా హీరోలుగా మారి చూపించారు. ఇప్పుడు మరోసారి ఇలాంటి ఫీట్‌ సౌత్‌ సినిమాలో చూడబోతున్నామా? అవుననే అంటున్నాయి కోడంబాక్కం వర్గాలు. అదేంటి వాళ్లకెలా తెలుస్తుంది అంటున్నారా? ఎందుకంటే హీరోలుగా మారుతున్న సంగీత దర్శకుడు, దర్శకుడు అక్కడివరే కాబట్టి.. వాళ్లే లోకేశ్‌ కనగరాజ్‌, అనిరుధ్‌. ఈ మేరకు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. లోకేశ్‌ కనగరాజ్‌, అనిరుధ్‌ రవిచందర్‌ను హీరోలుగా పరిచయం చేస్తూ స్టంట్‌ కొరియోగ్రాఫర్లు అన్బు – అరివు ఓ సినిమా తెరకెక్కిస్తారని పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

లోకేశ్‌, అనిరుధ్‌కి (Anirudh) తమిళం, తెలుగులో ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని అన్బు- అరివు ఓ ద్విభాషా చిత్రాన్ని ప్లాన్‌ చేస్తున్నారట. యాక్షన్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమాను అగ్ర నిర్మాణ సంస్థ నిర్మిస్తోందని అంటున్నారు. దీంతో ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఈ వార్తల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది. అయితే అనిరుధ్‌, లోకేశ్‌ ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్‌లో హీరోలుగా సినిమా చేసే పరిస్థితి లేదు అంటున్నారు.

ఓవైపు ‘లియో’ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్నారు లోకేశ్‌ కనగరాజ్‌. మరోవైపు అనిరుధ్‌ అయితే వరుస సినిమాలకు మ్యూజిక్‌ అందిస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్‌లో కూడా స్టార్‌ హీరోల సినిమాలు చేస్తున్నాడు. దీంతో ఈ రూమర్‌ ఎంతవరకు కరెక్ట్‌ అనేది తెలియడం లేదు. ఇక గతంలో రాఘవ లారెన్స్‌ ప్రధాన పాత్రలో ‘దుర్గ’ సినిమాను అన్బు – అరివు ప్రకటించారు. అయితే ఆ తర్వాత ఆ సినిమాపై ఎలాంటి అప్‌డేట్‌ లేదు.

ఇప్పుడు ఈ సినిమా అంటున్నారు. దీంతో నమ్మడానికి అంత నమ్మకంగా లేదు. కానీ ఇలాంటి ఛాన్స్‌ అయితే ఉంది అని రూమర్లు చెబుతున్నాయి. అయితే మరికొందరు ఇది ఓ షార్ట్‌ ఫిల్మ్ అని, ఓటీటీ కోసం చేస్తున్న కంటెంట్‌ అని కూడా అంటున్నారు. ఈ విషయంలో త్వరలోనే క్లారిటీ రావొచ్చు.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus