Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

సమంత(Samantha) ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ సినిమా ఈ శుక్రవారం అంటే జూన్ 19న విడుదల కానుంది. సొంత బ్యానర్ అయిన ‘ట్రాలాల మూవింగ్ పిక్చర్స్’ లో సమంత చేసిన సినిమా ఇది. 3 ఏళ్ళ తర్వాత సమంత ఫుల్ లెంగ్త్ లీడ్ రోల్ చేసిన సినిమా కావడంతో అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. రిలీజ్ టైమ్ దగ్గర పడుతుండటంతో ‘మా ఇంటి బంగారం’ని అగ్రెసివ్ గా ప్రమోట్ చేయాలని సమంత డిసైడ్ అయ్యింది. ఈ క్రమంలో ఆమె వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ హాట్ టాపిక్ అయ్యింది.

Samantha

తాజాగా ‘ఫిల్మీ ఫోకస్’ ఛానల్ తో సమంత ముచ్చటించింది. ఇందులో భాగంగా.. యాంకర్ సమంతను “మీరు కావాలనుకుంటే చాలా స్క్రిప్ట్‌లు ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. కానీ ఈ టైమ్లో పర్టిక్యులర్ గా  ‘మా ఇంటి బంగారం’ స్క్రిప్ట్ నే ఎందుకు ఎంపిక చేసుకున్నారు? 5 ఏళ్ళ క్రితం కానీ లేదంటే భవిష్యత్తులో కూడా ఇలాంటి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. కానీ ఎందుకు ఈ టైమ్లో ఈ స్క్రిప్ట్ పర్ఫెక్ట్ అని అనుకున్నారు?” అంటూ ప్రశ్నించాడు.

అందుకు సమంత బదులిస్తూ… “5 ఏళ్ళ క్రితం అయితే ఈ కథకు నేను పూర్తి న్యాయం చేయగలిగేదాన్ని కాదేమో.! అప్పట్లో నాపై నాకు అంత కాన్ఫిడెన్స్ లేదు. మనుషులుగా మనం ప్రతి 2 ఏళ్ళకు మారుతూ ఉంటాం! కొత్త పాఠాలు నేర్చుకుంటూ ఉంటాం. ప్రస్తుతం ఉన్న నా వ్యక్తిత్వానికి, ఆలోచనలకు ఈ కథ అయితే బాగా సెట్ అవుతుంది అనిపించింది. అందుకే నా సొంత ప్రొడక్షన్ హౌస్‌లోనే చేశాను” అంటూ చెప్పుకొచ్చింది.

సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags